Begin typing your search above and press return to search.

ఎయిడ్స్ మహమ్మారికి మందు... తెరపైకి షాకింగ్ లెక్కలు!

ఎయిడ్స్ విషయంలో ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఎయిడ్స్ ను అంతం చేయడానికి ప్రపంచం చేరువవుతోందంటూ తాజా పరిశోధన ఒకటి చెబుతోంది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 4:13 AM GMT
ఎయిడ్స్ మహమ్మారికి మందు... తెరపైకి షాకింగ్ లెక్కలు!
X

ఎయిడ్స్ మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గం' అంటూ ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య గురించిన ప్రచారం జరిగేది. 'జాగ్రత్తలు' తీసుకోవడం ద్వారా ఈ మహమ్మారి సోకకుండా ఉంటుందంటూ చెప్పేవారు. అయితే తాజాగా ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది!

అవును... ఎయిడ్స్ విషయంలో ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఎయిడ్స్ ను అంతం చేయడానికి ప్రపంచం చేరువవుతోందంటూ తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. ఇందులో భాగంగా... ఏడాదికి రెండుసార్లు చొప్పున టీకా తీసుకుంటే ఈ హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్.ఐ.వీ.) ఇన్ ఫెక్షన్లను నివారించడం సాధ్యమేనని చెబుతున్నారు.

ఈ మేరకు తాజాగా ఓ మహిళపై నిర్వహించిన పరిశోధనలో 100% ఎయిడ్స్ ఇన్ ఫెక్షన్లను సమర్థంగా నివారించడం సాధ్యమేనని తేలిందని అంటున్నారు! ఇదే సమయంలో పురుషుల్లోనూ ఇది దాదాపు ఇలాంటి ఫలితాన్నే ఇస్తోందని రుజువైందని చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా "యూఎన్ ఎయిడ్స్" కీలక విషయాలు వెల్లడించింది.

ఇందులో భాగంగా... ఇప్పటివరకూ ఎయిడ్స్ నివారణకు ఉన్న మార్గాలన్నింటిలోనూ ఇది మెరుగైనదని.. ఇది ఓ అనూహ్య పరిణామమని తెలిపింది. ఇదే సమయంలో... ఈ ఎయిడ్స్ మహమ్మారిని అంతంచేసే అవకాశం మన ముందుకు వచ్చిందని యూఎన్ ఎయిడ్స్ పేర్కొంది. స్వలింగ సంపర్కులకు, సెక్స్ వర్కర్లకు ఇదెంతో మేలు చేస్తుందని తెలిపింది.

ఈ మేరకు ప్రపంచ ఎయిడ్స్ డే ను పురస్కరించుకుని (డిసెంబర్ 1) ఆదివారం ఈ వివరాలను యూఎన్ ఎయిడ్స్ వెల్లడించింది. ఈ హెచ్.ఐ.వీ. ఎక్కువగా ఉన్న ఆఫ్రికా, కరేబియన్, ఆగ్నేయాసియా దేశాల్లో చవకైన జనరిక్ టీకాలు విక్రయించేందుకు అనుమతిస్తామని ఈ సందర్భంగా ఔషధ తయారీ సంస్థ గిలియాడ్ తెలిపింది.

ఈ సందర్భంగా యూఎన్ విడుదల చేసిన నివేదికలో... 2023లో సుమారు 6,30,000 మంది ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యాలతో మరణించారని.. 1.3 మిలియన్ల మంది హెచ్.ఐ.వీ. వైరస్ బారిన పడ్డారని తెలిపింది. ఆఫ్రికా దేశాల్లో ప్రతి రోజూ 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల 570 మంది వరకూ యువతులు ఎయిడ్స్ బారిన పడుతున్నట్లు వెల్లడించింది.