Begin typing your search above and press return to search.

ఏపీలో గెలిచే పార్టీ ఏదీ అంటే ఏఐ చెప్పిన జవాబిదే !?

కృతిమ మేధస్సు ఇపుడు ప్రపంచాన్ని శాసించే దిశగా తొలి అడుగులు వేస్తోంది.

By:  Tupaki Desk   |   28 May 2024 3:43 AM GMT
ఏపీలో గెలిచే పార్టీ ఏదీ అంటే ఏఐ చెప్పిన జవాబిదే !?
X

కృతిమ మేధస్సు ఇపుడు ప్రపంచాన్ని శాసించే దిశగా తొలి అడుగులు వేస్తోంది. మనిషి కనిపెట్టి కనిపెంచుతూ ఏఐని ఇపుడు తనతో పాటుగా తీసుకెళ్తున్నాడు. ఫ్యూచర్ లో ఏఐ మనిషిని ఏమి చేస్తుంది అన్న భయాందోళనలు ఉండనే ఉన్నాయి.

ఈ సంగతి కాసేపు పక్కన పెడితే ఏఐకి తెలియనిది లేదు అని అంటున్నారు. ఏ ప్రశ్న అడిగినా జవాబు దానికి తెలుసు. నెటిజన్లు అడిగే అనేక వింత ప్రశ్నలకు కొంటె ప్రశ్నలకు జెమినీ ఏఐ, మాయ ఏఐ జవాబులు చెబుతున్నాయి. అవి వర్తమానం, గతం ఇలా ఏ రంగంలో అడిగినా జవాబు ఠక్కున చెబుతున్నాయి.దాంతో ఇపుడు ఏపీలో రాజకీయం మీద ఆసక్తి ఉన్న వారు ఏ పార్టీ గెలుస్తుంది అన్న దాని మీద ఏకంగా ఏఐనే ఆశ్రయించారు.

సెఫాలజిస్టులు సైతం బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్న వేళ అధికారం ఏపీలో ఎవరితో ఏఐ తప్ప ఎవరూ చెప్పలేరని నమ్మిన నెటిజన్లు దానికే పరీక్ష పెట్టేలా ప్రశ్నను సంధించారు. ఇలా రాజకీయ కుతూహలం నిండుగా కలిగిన కొందరు నెటిజన్లు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ చాట్ జీపీటీలైన మాయ ఏఐని చేరి తమ ప్రశ్నల వర్షం కురింపించారు. వారు ముందుగా ప్రాథమిక ప్రశ్నతో మొదలెట్టి టఫ్ క్వశ్చన్ అడిగారు.

ఏపీకి ప్రస్తుత సీఎం ఎవరు అంటే జగని అని ఏఐ చెప్పేసింది. టీడీపీ అధినేత ఎవరూ అంటే దానికీ చంద్రబాబు అని జవాబు చెప్పింది. ఏపీలో ఎన్నికలు రాడికల్ గా జరిగాయని మరో జవాబు చెప్పింది. ఏపీలో ఎక్కడెక్కడ ఎన్నికల హింస జరిగింది అంటే పల్నాడు, తాడిపత్రి అని తిరుగులేని సమాధానాలే ఇచ్చింది.

ఇన్ని జవాబులు కరెక్ట్ గా చెప్పింది కదా అని ఏపీలో ఎవరిది అధికారం రేపటి ఎన్నికల్లో విజేత ఎవరు అంటే మాత్రం ఏఐ చాలా గడుసుగానే బదులిచ్చింది. అదేంటి అంటే దీనికి జవాబు నాకు తెలియదు తెలిసాక చెబుతా అంటూ తప్పించేసుకుంది మాయా ఏఐ. దీంతో తల పట్టుకోవడం నెటిజన్ల వంతు అయింది.

ఆఖరుకు ఏఐని సైతం తికమక పెట్టేలా ఏపీలో ఎన్నికలు జరిగాయా అన్నదే ఒక చర్చగా ఉంది. అంతే కాదు ఫలితాలు ఎవరూ చెప్పలేని విధంగా మారాయా అన్నది కూడా మరో రకం చర్చగా ఉంది. ఏది ఏమైనా ఏఐ కి కూడా జవాబు ఇవ్వలేని విధంగా ఏపీ ఫలితాలు ఉన్నాయంటే మాత్రం ఓటేసిన జనాలకు కోటి దండాలు చెల్లించాల్సిందే అని అంటున్నారు.