Begin typing your search above and press return to search.

వీడియో... బ్రహ్మం గారు చెప్పిన వింతలా ఉందే!

ఎవరు ఎన్ని చెప్పినా.. ఎలా చెప్పినా.. ఎవరికి వారు తమ వెర్షన్స్ కి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   27 May 2024 5:21 AM GMT
వీడియో... బ్రహ్మం గారు చెప్పిన వింతలా ఉందే!
X

వేప చెట్టు ఏమిటి.. దానికి మామిడి కాయలు కాయడం ఏమిటి..? అద్భుతం అని ఒకరంటే.. కలియుగం అని ఇంకొకరు అంటున్నారు.. బ్రహ్మం గారు చెప్పినట్లు అని మరొకరు చెబుతున్నారు.. అయితే వృక్ష శాస్త్రవేత్తలు వారి వెర్షన్ వారు చెబుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ఎలా చెప్పినా.. ఎవరికి వారు తమ వెర్షన్స్ కి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారని తెలుస్తుంది.

అవును... తాజాగా ఒక వేపచెట్టుకు మామిడికాయలు కాశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన జనం ఏంటి ఈ వింత అని చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. మరికొంతమంది పూజలకు సిద్ధమైపోతున్నారని అంటున్నారు! ఇంకొంతమంది కలియుగం అంతమవ్వడానికి ఇవన్నీ సూచికలు అని చెప్పుకొస్తున్నారు!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ రాష్ట్ర పంచాయతీ శాఖా మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేపచెట్టుకు మామిడి కాయలు కాసింది. దీంతో ఆయన ఆ అద్భుతాన్ని వీడియో తీశారు! ఈ వీడియోను ఆయనే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని చూసి ఆశ్చర్యపోయినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... గతంలో బ్రహ్మం గారు చెప్పినట్లు ఈ వింత జరిగిందని.. ఇది నిజంగా భగవంతుని మహిమే అని.. ఇది కలియుగం అంతమవ్వడానికి ఒక సూచన అని చెబుతూ కామెంట్లు పెడుతుండటం! అయితే... వేప కొమ్మపై మామిడి పూత పడటంతోనే ఇలా జరిగి ఉంటుందని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరోపక్క దీన్ని లైవ్ లో చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారట. లైవ్ లో చూసే అవకాశం లేనివారు ఈ ఆన్ లైన్ వీడియోపై ఓ లుక్కేయండి.