Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్.. తీవ్ర ఉత్కంఠ నడుమ ఎయిరిండియా విమానం సేఫ్ ల్యాండింగ్.!

సుమారు 141 మంది ప్రయాణికులతో ఉన్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా... పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.

By:  Tupaki Desk   |   11 Oct 2024 3:10 PM GMT
బిగ్ బ్రేకింగ్.. తీవ్ర ఉత్కంఠ నడుమ ఎయిరిండియా విమానం సేఫ్ ల్యాండింగ్.!
X

సుమారు 141 మంది ప్రయాణికులతో ఉన్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా... పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. హైడ్రాలిక్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

అవును.. ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ ప్రకటించారు. తమిళనాడులోని తిరుచ్చి మీదుగా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో సుమారు గంటన్నర సమయం వరకూ విమానం గాలో చక్కర్లు కొట్టిందనే విషయం తీవ్ర భయాందోళనలు కలిగించింది. ఈ సమయంలో ఎయిర్ పోర్టులో హైటెన్షన్ సిట్యుయేషన్ నెలకొంది.

మరోపక్క విమానాశ్రయానికి అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు రావడంతో అక్కడున్నవారిలోనూ తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. అయితే సుమారు రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం.. పైలట్లు చాకచక్యంగా ఎయిరిండియా విమానం ఏ.ఎక్స్.బీ.613ని సేఫ్ గా ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదే సమయంలో ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ప్రమాద తీవ్రతను తగ్గించేందుకన్నట్లుగా విమానాశ్రయంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా... 20 ఫైరింజన్లు, 20 అంబులెన్సులతోపాటు పారామెడికల్ స్టాఫ్ ని సిద్ధంగా ఉంచారు. అయితే ఎట్టకేలకు ఎయిరిండియా విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా... అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయాలంటే మందుగా అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకూ తగ్గాల్సి ఊంటుంది.. అప్పుడే విమానం ల్యాండింగ్ చేసే వీలుంటుంది. ఈ నేపథ్యంలో.. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన పైలట్లు సుమారు రెండు గంటలు తర్వాత సక్సెస్ అయ్యారు!