'విమానాల స్పీడు తగ్గాలి'... కేంబ్రిడ్జి యూనివర్శిటీ నివేదికలో ఏముంది?
అవును... రోజు రోజుకీ విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతుండటంతో.. రానున్న రోజుల్లో విమానాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 25 Sep 2024 7:30 PM GMTఏమాత్రం ఆర్థికంగా కాస్త ఖర్చు పెట్టగలిగినా.. ప్రయాణించే మార్గాల్లో విమాన సౌకర్యం ఉన్నా.. చాలా మంది వాయుమార్గాన్నే ప్రిఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జి యూనివర్శిటీ తాజాగా ఓ నివేదికను విడుదల చేసి, పలు సూచనలు చేసింది.
అవును... రోజు రోజుకీ విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతుండటంతో.. రానున్న రోజుల్లో విమానాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో... విమాన వేగాన్ని సుమారు 15 శాతం తగ్గించాలని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ సమయంలో కేంబ్రిడ్జి యూనివర్శిటీ తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
ఇందులో భాగంగా... ప్రస్తుతం ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే విమాన ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో విమానాల సంఖ్య పెరిగితే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ (సీఓ2) ఉద్గారాలు ప్రస్తుతం ఉన్న 2.5 శాతం నుంచి 4 శాతానికి పెరుగుతుందని అంటున్నారు.
దీనికోసం విమానయాన రంగంలో పలు కీలక మార్పులు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఇందులో భాగంగా... విమాన వేగాన్ని 15 శాతం తగ్గించాలని.. దీనివల్ల 50 నిమిషాల పాటు ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇంధన దహనం 5 నుంచి 7 శాతం తగ్గుతుందని, వాతావరణ పరిస్థితులకు దోహదపడుతుందని అంటున్నారు.
ఈ క్రమంలోనె 2050 నాటికి సున్నా నికర ఉద్గారాలను సాధించేందుకు ప్రాణాళికను రూపొందించాలని పరిశోధనకారులు వెల్లడిస్తున్నారు.