400 మందితో ఉన్న విమానంలో భారీ మంటలు... వీడియో వైరల్!
అవును... టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా బోయింగ్ ఫ్లైట్ ఏసీ872 విమానం టెకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి.
By: Tupaki Desk | 9 Jun 2024 3:56 AM GMTఇటీవల కాలంలో వరుస విమాన ప్రమాధాలు ఎయిర్ బస్ ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆందోళనకర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్దేత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిసి 400 మంది ఉన్నారు.
అవును... టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా బోయింగ్ ఫ్లైట్ ఏసీ872 విమానం టెకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీంతో పెను ప్రమాదమే తప్పింది.
జూన్ 5 సాయంత్రం కెనడా నుంచి పారిస్ వెళ్లే విమానం 400 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరింది. అయితే టెకాఫ్ అయిన కాసేపటికే విమానంలో పెద్దేత్తున మంటలు రావడం మొదలయ్యింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాన్ని బట్టి.. విమానం కుడి ఇంజన్ నుంచి మంటలు వస్తున్నట్లు కనిపిస్తుంది.
అయితే... విషయం గ్రహించిన పైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాధం తప్పిందని.. విమానంలో ఉన్న అంతా క్షేమంగా ఉన్నారని విమానయాన సంస్థ ఎయిర్ కెనడా తెలిపింది. ఇదే సమయంలో... ఇంజిన్ కంప్రెసర్ సమస్య వల్లే విమానంలో మంటలు చెలరేగాయని ఎయిర్ కెనడా ప్రతినిధి తెలిపారు.