నిజ జీవితంలో 'క్రూ' సీన్... ఫస్ట్ టైం అంటున్న ఎయిర్ లైన్స్!
ఎయిర్ పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాలుగా మారుతున్నాయనే కామెంట్లు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 2 Jun 2024 3:57 AM GMTఎయిర్ పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాలుగా మారుతున్నాయనే కామెంట్లు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా విదేశాల నుంచి వస్తున్న కొంతమంది ప్రయాణికులు బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అయితే మెజారిటీ స్మగ్లర్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎంత వ్యూహాత్మకంగా ఆలోచించినా.. అధికారులకు మాత్రం చిక్కడం తప్పడం లేదని అంటుంటారు. అయితే ఇటీవల కాలంలో ఎయిర్ హోస్టెస్ కూడా ఈ పనులకు పాల్పడుతున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి.
అవును... ఒకప్పుడు సాధారణంగా విదేశాల నుంచి వస్తున్న కొంతమంది ప్రయాణికులు మాత్రమే ఈ బంగారం అక్రమ రవాణాలకు పాల్పడుతుండగా.. తాజాగా ఎయిర్ హోస్టెస్ కూడా ఆ పనికి పూనుకుంటున్నారనే అంశం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా.. ఎయిర్ హోస్టెస్ ఇలాంటి పనులకు పాల్పడటానికి తాజాగా ఏవియేషన్ ఇండస్ట్రీపై తెరకెక్కిన బాలీవుడ్ సినిమా "క్రూ" ఆదర్శమా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన "క్రూ" అనే సినిమాలో టబు, కరీనా కపూర్, శృతి సనన్ లు నటించారు. తమ యజమానులు సుమారు ఆరు నెలలకు పైగా జీతాలు చెల్లించకపోయేసరికి వారంతా బంగారం స్మగ్లింగ్ ప్రారంభిస్తారు! దీంతో... ఇటీవల తెరపైకి వచ్చిన ఎయిర్ హోస్టెస్.. ఈ సినిమా నుంచి ఇన్ స్పైర్ అయ్యారా అనే చర్చ తెరపైకి వచ్చింది. అందుకూ ఒక బలమైన కారణం ఉంది... కోల్ కతా కు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ తాజాగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.
వివరాళ్లోకి వెళ్తే... కోల్ కతా కు చెందిన సురభి ఖాతున్ (26) అనే ఎయిర్ హోస్టెస్ తన ప్రైవేట్ పార్ట్స్ లో సుమారు 960 గ్రాముల బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. మస్కట్ నుంచి కన్నూర్ కి అక్రమంగా ఈ బంగారం తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు.
కొచ్చిన డీ.ఆర్.ఐ వర్గాల నుంచి వచ్చిన పక్కా సమాచారం మేరకు కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ని మస్కట్ నుంచి వచ్చిన సురభీ ఖాతున్ అనే క్యాబిన్ సిబ్బంధిని అధికారులు అడ్డుకున్నారు. ఆమె తన ప్రైవేట్ పార్టులో సుమారు 960 గ్రాముల బంగారాన్ని ఉంచి, స్మగ్లింగ్ కి పాల్పడుతోంది. ఈ సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్న అనంతరం జ్యూరిడిక్షనల్ మేజిస్ట్రేట్ ముందు హజరుపరిచారు. ఇదే సమయంలో 14 రోజుల రిమాండ్ లో భాగంగా మహిళా జైలుకు పంపబడ్డారు.
కాగా... ప్రైవేటు పార్ట్స్ లో బంగారన్ని దాచి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎయిర్ లైన్ సిబ్బందిని పట్టుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.