ఎయిరిండియా విమానంలో మంటలు... వీడియో వైరల్!
ఇంజిన్ లో మంటలు చెలరేగడమే అందుకు కారణం అని అంటున్నారు.
By: Tupaki Desk | 19 May 2024 7:49 AM GMTవిమాన ప్రమాదాల ఖాతాలో మరో సంఖ్య పెరిగింది. ఇందులో భాగంగా... బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇంజిన్ లో మంటలు చెలరేగడమే అందుకు కారణం అని అంటున్నారు.
ఈ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 179 మంది, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని.. కాకపోతే కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని అంటున్నారు. అవును... బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అయ్యింది. అలా టేకాఫ్ అయిన కాసేపటికే మంటల్ని గుర్తించారట సిబ్బంది.
దీంతో... వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు తెలియజేశారట. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో అత్యవసర ఏర్పాట్లు చేసి.. రాత్రి 11:12 గంటల సమయంలో విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో... విమానం గాల్లో ఉండగా మంటలు వ్యాపించడంతో అవి చూసి తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
అయితే... ఎలాంటి ప్రమాదం లేదని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని ధైర్యం చెబుతూనే సిబ్బంది ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారని వారు వెల్లడించారు. ఈ సమయంలో రన్ వేపై క్రాష్ ల్యాండ్ అవ్వగానే ఓపెన్ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులంతా ఒకేసారి బయటకు వచ్చారు. ఈ సమయంలోనే కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయని తెలుస్తుంది.