Begin typing your search above and press return to search.

''మా పెరట్లో విమానం డోర్ ప్లగ్ దొరికింది''!

ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగా పడిపోయిన భాగాలు, ప్రయాణికుల వస్తువులను ఆదివారం పలు చోట్ల గుర్తించారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 3:30 PM GMT
మా పెరట్లో విమానం డోర్  ప్లగ్  దొరికింది!
X

శుక్రవారం రాత్రి అమెరికాలోని పోర్ట్‌ లాండ్‌ నుంచి ఒంటేరియోకు బయలుదేరిన అలాస్కా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ఫ్లైట్‌ - 1282 సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే. అసలు సుమారు 16,000 అడుగుల ఎత్తులో గతన తలంలో దూసుకుపోతున్న విమానంలో డోర్ ఊడిపోవడం అనేది ఏ స్థాయిలో ఉంటుందనేది ఊహకు సైతం ఆందోళన కలిగించే విషయమే! ఈ సమయంలో తాజాగా దీనికి సంబంధించి మరో భారీ లోపం బయటపడింది.

అవును... అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ నుంచి ఒంటేరియోకు బయలుదేరిన అలస్కా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ విమానం కాక్‌ పీట్‌ వాయిస్‌ రికార్డర్‌ లో డేటా ఓవర్‌ రైట్‌ అయినట్లు నేషనల్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ బృందం గుర్తించింది. దీనిని సరైన సమయంలో ఆఫ్‌ చేయకపోవడమే కారణంగా అధికారులు భావిస్తున్నారు. విమానం నుంచి కాక్‌ పీట్‌ వాయిస్‌ రికార్డర్‌ ను తాజాగా స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది!

ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగా పడిపోయిన భాగాలు, ప్రయాణికుల వస్తువులను ఆదివారం పలు చోట్ల గుర్తించారు. ఇందులో భాగంగా... డోర్‌ ప్లగ్‌ ను పోర్ట్‌ లాండ్‌ లోని బాబ్‌ అనే టీచర్‌ పెరట్లో దొరికింది. దీంతో బారెన్స్‌ రోడ్‌ వద్ద ఫ్లైట్‌ డోర్‌ ఊడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో తన పెరట్లో విమానం భాగం దొరికిందనే విషయాన్ని బాబ్‌ దర్యాప్తు బృందానికి మెయిల్‌ చేసి తెలిపారు. దీని బరువు సుమారు 30 కిలోలు ఉంటుందని పేర్కొన్నారు.

అంటే... సుమారు 30 కిలోల బరువున్న వస్తువు 16,000 కిలోమీటర్ల ఎత్తునుంచి పడిందన్న మాట. అదే జనావాసం ఉన్న చోట పడి ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేదని ఊహించుకోవచ్చు! మరోపక్క విమానం నుంచి పడిపోయిన ఐఫోన్ ను అధికారులు గుర్తించారు. దీనిలో ఇంకా సగం ఛార్జింగ్ ఉందని తెలిపారు. ఇలా ఆ విమానానికి సంబంధించిన భాగాలు, అందులోని ప్రయాణికుల వస్తువులు అక్కడక్కడనుంచీ స్వాధీనం చేసుకుంటున్నారు.

కాగా... అలాస్కా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానం 1282.. అమెరికాలోని పోర్ట్‌ లాండ్‌ నుంచి ఒంటేరియోకు శుక్రవారం రాత్రి సుమారు 174 మంది ప్రయాణికులతో బయలుదేరిన సంగతి తెలిసిందే! అలా బయలుదేరిన విమానం 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత దాని డోర్‌ ఊడిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎన్.టీ.బీ.సీ. దర్యాప్తు ప్రారంభించింది.