కొత్త చీటింగ్... ఏఐతో ముఖం మార్చుకొని వీడియో కాల్!
ఈ సమయం లో ఏఐ ద్వారా లైవ్ వీడియోల ను కూడా సులభంగా మార్ఫింగ్ చేసే విధానం ఉపయోగించుకుని ఓ వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ చేసి చీట్ చేశాడ ని తెలుస్తుంది.
By: Tupaki Desk | 18 July 2023 4:36 AM GMTఆధునిక సాంకేతికతతో ఉపయోగాలు ఎన్ని ఉంటాయో, అదేస్థాయి లో మోసాలు కూడా సహజం అని అంటుంటారు. ఇక తాజా విప్లవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయం లో కూడా ఇది నిజమని మరోసారి రుజువైందని తెలుస్తుంది. ఇందు లో భాగంగా... ఒక వాట్సప్ వీడియో కాల్ తెరపైకి వచ్చిందని తెలుస్తుంది.
అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యక్తుల ముఖాన్ని మార్చేసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటు లోకి వచ్చిందనేది తెలిసిన విషయమే. ఏఐ తో ఏదైనా సాధ్యమే అనే స్థాయి కామెంట్లు ఆన్ లైన్ వేదీక గా వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయం లో ఏఐ ద్వారా లైవ్ వీడియోల ను కూడా సులభంగా మార్ఫింగ్ చేసే విధానం ఉపయోగించుకుని ఓ వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ చేసి చీట్ చేశాడ ని తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... కేరళ లోని కోజికోడ్ కు చెందిన రాధాకృష్ణన్ కు గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సప్ వీడియో కాల్ వచ్చిందట. ఆ కాల్ లో మాట్లాడుతున్న వ్యక్తి.. ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న తన స్నేహితుడి ని పోలి ఉన్నట్లు గుర్తించాడట. ఈ సమయం లో రాధాకృష్ణన్ కు తెలిసిన పేర్లను చెప్పాడట. దీంతో అతడు తన స్నేహితుడేన ని రాధాకృష్ణన్ భావించాడట.
ఆ తర్వాత వీడియో కాల్ చేసిన వ్యక్తి... తాను దుబాయ్ లో ఉన్నానని, తన బంధువుల చికిత్స కోసం డబ్బులు కావాల ని.. ఇండియా తిరిగి రాగానే ఇచ్చేస్తానని చెప్పాడని అంటున్నారు. దీనికోసం రూ.40,000 ఇవ్వాలని కోరాడట. దీంతో స్నేహితుడు అడిగాడు కదా అని భావించిన రాధాకృష్ణన్... ఆ సొమ్ము పంపించాడని తెలుస్తుంది.
మళ్లీ కొన్ని రోజుల తర్వాత మరోసారి కాల్ చేసి రూ.35 వేలు అడిగాడంట. దీంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణన్... తన స్నేహితుడిని సంప్రదించగా అసలు విషయం బయటపడిందని తెలుస్తుంది. దీంతో అప్ప్పటికి విషయం గ్రహించిన రాధాకృష్ణన్ ఈ నెల 15న పోలీసుల కు ఫిర్యాదు చేశాడట.
దీంతో రంగం లోకి దిగిన కేరళ పోలీసుల సైబర్ ఆపరేషన్ విభాగం.. దర్యాప్తు చేపట్టిందట. ఆ వీడియో కాల్ చే సిన మోసగాడి ని గుర్తించి అతడి దగ్గర నుంచి మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకుని రాధాకృష్ణన్ కు తిరిగి అప్పగించిందని తెలుస్తుంది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల ని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారని అంటున్నారు!