10 నెలల అకాయ్ కోహ్లీ అప్పుడే రికార్డు?
ఈ పేరు అర్థాన్ని కనుగొనడానికి చాలా మంది గూగుల్ ని ఆశ్రయించారు.
By: Tupaki Desk | 12 Dec 2024 1:30 AM GMTఅనుష్క శర్మ - విరాట్ కోహ్లి తమ 7వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారి రెండవ సంతానంగా మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. నవజాత శిశువుకు 'అకాయ్' అని పేరు పెట్టారు. జూనియర్ కోహ్లీ అంటూ అభిమానులు ఉత్సాహంగా మాట్లాడుకున్నారు. అయితే అకాయ్ ఇలా పుట్టగానే అలా తండ్రికి తగ్గ తనయుడిగా రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో అకాయ్ పేరు సంచలనం సృష్టించింది. ఈ పేరు అర్థాన్ని కనుగొనడానికి చాలా మంది గూగుల్ ని ఆశ్రయించారు. దీంతో గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌లో 'అకాయ్ ' పేరు చోటు దక్కించుకుంది.
10 నెలల వయసున్న అకాయ్ 'మీనింగ్' కేటగిరీ కింద గూగుల్ శోధన- 2024 జాబితాలో రెండవ స్థానాన్ని పొందింది. ఈ జాబితాలో ఆల్ ఐస్ ఆన్ రఫా టాప్ పొజిషన్‌ను కైవసం చేసుకుంది. మిగిలిన పేర్లలో గర్భాశయ క్యాన్సర్ , డిమ్యూర్ ఉన్నాయి.
అకాయ్ అనేది టర్కిష్ మూలాలతో కూడిన హిందీ పదం. ఇది 'కాయ' అనే పదం నుండి పుట్టింది. దీని అర్థం శరీరం. సంస్కృతంలో అకాయ్ అనేది 'కాయ్ లేకుండా ఏదైనా' అని .. ఇది రూపం లేదా శరీరం లేకుండా అనే అర్థం చేసుకోవాలి. విరాట్- అనుష్క శర్మ జంటకు వామిక అనే ఆడబిడ్డ తొలి సంతానంగా జన్మించిన సంగతి తెలిసిందే. విరుష్క జంట ఇటీవల లండన్ లో నివాసం ఉంటున్నారు. ఇస్కాన్ భక్తులుగా కీర్తన్ లకు, సనాతన ధర్మానికి ప్రాధాన్యతనిస్తున్నారు.