Begin typing your search above and press return to search.

''విష‌పు ఇంజెక్ష‌న్ల‌తో మ‌మ‌ల్ని లేపేయాల‌ని చూస్తున్నారు''

''విష‌పు ఇంజెక్ష‌న్ల‌తో మ‌మ‌ల్ని లేపేయాల‌ని చూస్తున్నారు`` అని హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత సోద‌రుడు అక్బ‌రుద్దీన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By:  Tupaki Desk   |   16 April 2024 9:39 AM GMT
విష‌పు ఇంజెక్ష‌న్ల‌తో మ‌మ‌ల్ని లేపేయాల‌ని చూస్తున్నారు
X

''విష‌పు ఇంజెక్ష‌న్ల‌తో మ‌మ‌ల్ని లేపేయాల‌ని చూస్తున్నారు`` అని హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత సోద‌రుడు అక్బ‌రుద్దీన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం అక్బ‌రుద్దీన్ చంద్రాయ‌ణ గుట్ట ఎమ్మెల్యేగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించిన‌వి అనేది తెలియాల్సి ఉంది. అయితే.. బీజేపీని ఉద్దేశించే అక్బ‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. తాము హైద‌రాబాద్‌లో బ‌లంగా ఉన్నామ‌ని అక్బ‌ర్‌ చెప్పారు. దీనిని గిట్ట‌ని కొంద‌రు త‌మ‌ను ఏదో ఒక కేసు లో ఇరికించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అన్నారు.

''మాపై ఏవో కేసులు పెట్టాల‌ని చూస్తున్నారు. మాముందు నోరు పెగ‌ల్చ‌లేని వారు.. మా వెనుక కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌ను అంతం చేయాల‌ని చూస్తున్నారు. మాకు బెదిరింపు కాల్స్ కూడా వ‌స్తు న్నాయి. ముందు అరెస్టు చేస్తారు. త‌ర్వాత‌.. ఏదో ఓ బ‌ల‌మైన కేసులో ఇరికించేస్తారు. ఈ నెపంతో జైల్లో పెడ‌తారు. త‌ర్వాత‌.. వైద్యంపేరుతో ఇంజ‌క్ష‌న్లు ఇస్తారు. ఆ ఇంజెక్ష‌న్ల‌లో విషాన్ని క‌లుపుతారు. అలా మ‌మ్మల్ని.. నెమ్మ‌దిగా ప్రాణాపాయంలోకి నెడ‌తారు. మేం చ‌నిపోయేలా చేస్తారు'' అని అక్బ‌రుద్దీన్ సంచ‌లన‌ వ్యాఖ్య‌లు చేశారు.

అంతేకాదు.. త‌మ‌పై కాల్పులు జ‌రిపిగా ఆశ్చ‌ర్యంలేద‌ని అక్బ‌రుద్దీన్ వ్యాఖ్యానించారు. అయితే.. తాము ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేద‌న్నారు. తాము అనేక క‌ష్ట న‌ష్టాలు ఎదుర్కొని మ‌రీ.. రాజ‌కీయంగా ఉన్నామ‌ని.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌ని అక్బ‌రుద్దీన్ వ్యాఖ్యానించారు. ''హైద‌రాబాద్‌లో ఎవ‌రొచ్చి.. గుడ్డ‌లు చించుకున్నా.. మ‌మ్మ‌ల్ని ఓడించ‌లేరు. వ‌చ్చే ఎన్నిల్లోనూ మాదే గెలుపు. ఈ గ‌డ్డ‌.. ఎంఐఎం అడ్డా'' అని తీవ్ర‌స్థాయిలో అక్బ‌రుద్దీన్ వ్యాఖ్యానించారు. కానీ, ప్ర‌స్తుతం హైద‌రాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ కొంప‌ల్లి మాధ‌వీల‌త అనే మ‌హిళా అభ్య‌ర్థికి టికెట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మె త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నారు. ఈమెకు.. కేంద్ర ప్ర‌భుత్వం వై కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను కూడా క‌ల్పించింది.