Begin typing your search above and press return to search.

అఖిల్ పహిల్వాన్ వ్యభిచారం కేసు... తెరపైకి సినీ ఇండస్ట్రీతో సంబంధాలు!!

అవును... హైదరాబాద్ రాంనగర్ అఖిల్ పహిల్వాన్ వ్యభిచార అరెస్ట్ కేసులో పోలీసులు అతడి గతాన్ని తవ్వే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 1:23 PM
అఖిల్ పహిల్వాన్ వ్యభిచారం కేసు... తెరపైకి సినీ ఇండస్ట్రీతో సంబంధాలు!!
X

అఖిల్ పహిల్వాన్ అనే పేరు హైదరాబాద్‌ లో ఉండే చాలామందికి తెలుసనే సంగతి తెలిసిందే! ప్రధానంగా బోనాల జాతర సందర్భంగా ఈ పహిల్వాన్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఈ పహిల్వాన్ ఆధ్వర్యంలోనే జరుగుతున్న వ్యభిచార వ్యవహారం షాకింగ్ విషయాలతో వెలుగులోకి వచ్చింది! ఈ సందర్భంగా అఖిల్ పహిల్వాన్ వ్యభిచార అరెస్ట్ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.

అవును... హైదరాబాద్ రాంనగర్ అఖిల్ పహిల్వాన్ వ్యభిచార అరెస్ట్ కేసులో పోలీసులు అతడి గతాన్ని తవ్వే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో అతడి పాత ట్రాక్ రికార్డ్ బయటికి తీస్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... అతడి మొబైల్ ఫోన్ లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారని తెలుస్తుంది.

అంతేకాకుండా... ఆ వ్యభిచార ముఠా నిర్వాహకులతో రోజుకి కనీసం 20 - 30 కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు! ఈ క్రమంలోనే సుమారు పశ్చిమ బెంగాల్ కు చెందిన పదహారు మంది అమ్మాయిలతో ఓ హోటల్ లో 25 రోజులుగా ఇతడు వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారని సమాచారం!

శుక్రవారం రాత్రి రాత్రి అబిడ్స్ లోని ఓ హోటల్ లో హైటెక్ వ్యవభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో... రాంనగర్ అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. దీంతో పోలీసులు అఖిల్ ను అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో... అతడితోపాటు 16మంది అమ్మాయిలు, నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారని.. 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది.

ఈ సమయంలో... అఖిల్ పహిల్వాన్ గడిచిన కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న 16మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలతోనే కాకుండా.. స్థానికంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారితో కూడా అఖిలేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి! దీంతో ఈ కేసు విషయంలో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారని తెలుస్తుంది.