Begin typing your search above and press return to search.

ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వంతు... టీం ఇండియా ఓటమికి కారణం అదే!

క్రికెట్ వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ లలోనూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం ఇండియా.. ఫైనల్స్ లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 10:45 AM GMT
ఇప్పుడు అఖిలేష్  యాదవ్  వంతు... టీం ఇండియా ఓటమికి కారణం అదే!
X

క్రికెట్ వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ లలోనూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం ఇండియా.. ఫైనల్స్ లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ జరిగిన రోజులు గడుస్తున్నా.. ఆ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారని చెప్పినా అతిశయోక్తి కాదు. దీంతో ఈ ఓటమిపై క్రికెటర్లు, విశ్లేషకులతో పాటు రాజకీయ నాయకులు తమదైన విశ్లేషణ తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అఖిలేష్ యాదవ్ ఈ పనికి పూనుకున్నారు

అవును... తాజాగా ముగిసిన వన్ డే వరల్డ్ కప్ లో వరుసగా 10 మ్యాచ్ లు గెలిచిన టీం ఇండియా ఫైనల్ లోనూ విజయం సాధిస్తుందని, ప్రపంచ కప్ మనకే దక్కుతుందని యావత్ దేశం భావించింది. కానీ ఫలితం వేరేగా వచ్చింది. అయితే... ఆట అన్నాక గెలుపోటములు సహజమే అయినప్పటికీ... ఈ విషయాన్ని క్రికెట్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో టీం ఇండియా ఓటమికి బీజేపీయే కారణం అని అంటున్నారు పలువురు రాజకీయ నాయకులు.

ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇలాంటి కామెంట్లే చేయగా.. తాజాగా సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఇలానే స్పందించారు. ఇందులో భాగంగా వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా ఓడిపోవడానికి కారణం నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీలే అని తేల్చి చెప్పేశారు. అయితే... అదేదో రాజకీయ కారణంగానే కాకుండా... పిచ్ గురించిన ప్రస్థావన లేవనెత్తడం గమనార్హం

ఉత్తర్ ప్రదేశ్ లోని తాజాగా జరిగిన బహిరంగ సభలో మైకందుకున్న అఖిలేష్ యాదవ్... వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా ఓటమికి గల కారణాలను వెల్లడించారు! ఇందులో భాగంగా... గుజరాత్ లో కాకుండా మ్యాచ్ లక్నోలో జరిగి ఉంటే టీమిండియాకు ఎంతో మంది ఆశీస్సులు లభించేవని అన్నారు. ఇక్కడ భారత జట్టుకు విష్ణువు, అటల్ బిహారీ వాజ్ పేయి ఆశీస్సులు లభించేవని చెప్పుకొచ్చారు

అలా కాకుండా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కండక్ట్ చేయడం వల్ల పిచ్ లో ఉన్న కొన్ని సమస్యలు మన ఆటగాళ్లను ఇబ్బందికి గురిచేశాయని అన్నారు! వాటి వల్ల ఆటగాళ్ల సన్నద్ధత అసంపూర్తిగా మిగిలిపోయిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

కాగా... యూపీలో అధికారంలో ఉన్న సమయంలో సమాజ్ వాదీ పార్టీ లక్నోలోని క్రికెట్ స్టేడియానికి "ఎకానా స్టేడియం"గా నామకరణం చేసింది. ఎకానా అంటే విష్ణువుకున్న అనేక నామాల్లో ఒకటి. అయితే 2018లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత.. ఆ స్టేడియంకు "భారతరత్న అటల్ బిహారీ వాజపేయి ఏకానా క్రికెట్ స్టేడియం" పేరు మార్పు చేశారు. ఈ నేపథ్యంలోనే... ఫైనల్ మ్యాచ్ లక్నోలో పెట్టి ఉంటే... అటు విష్ణువు, ఇటు వాజపేయి ఆశిస్స్తులు ఉండేవని, టీం ఇండియా గెలిచేదని అఖిలేష్ కామెంట్ చేశారు!