అక్షతా మూర్తే అధిక సంపన్నురాలు.. బ్రిటన్ ప్రధాని దంపతుల సరికొత్త రికార్డు
అక్షతా మూర్తి. ఈ పేరు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధ దంపతుల గారాల పట్టి. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ సతీమణి.
By: Tupaki Desk | 18 May 2024 9:40 AM GMTఅక్షతా మూర్తి. ఈ పేరు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధ దంపతుల గారాల పట్టి. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ సతీమణి. అయితే.. ఆమె ఇప్పుడుమరో ఘనత కూడా సంపాయించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంపన్నురాలి జాబితాలో చేరిపోయారు. ఆమెతోపాటు బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ పేరుకూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం రెండేళ్లలోనే వారి సంపద రెట్టింపు పెరగడమే.
తాజాగా విడదల చేసిన `సండే టైమ్స్` కుబేరుల జాబితాలో సునాక్, అక్షత దంపతులు చోటు దక్కించు కున్నారు. గత రెండేళ్లకంటే కూడా వీరి ర్యాంకు సంపన్నుల పరంగా మరింత మెరుగు పడింది. గత ఏడాది 275 వ ర్యాంకులో ఉన్న వీరిద్దరూ.. ఇప్పుడు 245 వ స్థానానికి ఎగబాకారు. ఈ ఏడాది సుమారు వీరి సంపద రూ.6873 కోట్లుగా ఉందని సండే టైమ్స్ వెల్లడించింది. బ్రిటన్ కరెన్సీలో 651 మిలియన్ పౌండ్లుగా ఉంది.
గత ఆర్థిక సంవత్సరం 2022-23లో రుషి సునాక్ ఆదాయం రూ.23 కోట్లు కాగా, అక్షతామూర్తికి డివిడెండ్ల రూపంలో రూ.137 కోట్లు వచ్చాయి. అయితే.. ఇంత ఆదాయం రావడానికి కారణం.. ఇన్పోసిస్‌లో ఉన్న షేర్లే కావడం గమనార్హం. గత ఏడాది తన మనవడికి కూడా నారాయణ మూర్తి షేర్లలో భాగస్వామ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.