ఆలపాటి రుణం తీర్చుకుంటున్న మంత్రివర్యులు..!
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. ఉరఫ్ ఆలపాటి రాజా. ఇప్పుడు రాజకీయంగా కేంద్ర బిందువు అయ్యారు.
By: Tupaki Desk | 27 Oct 2024 8:30 PM GMTఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. ఉరఫ్ ఆలపాటి రాజా. ఇప్పుడు రాజకీయంగా కేంద్ర బిందువు అయ్యారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటాలో ఆయన పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో కాలికి బలపం కట్టుకుని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా తొలి గొంతు లేచిం ది. అదే.. మంత్రి నాదెండ్ల మనోహర్. ఆలపాటిని గెలిపించేందుకు తాను రంగంలోకి దిగుతానంటూ.. నాదెండ్ల ప్రకటించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అనంతరం చిట్ చాట్‌గా ఈ విషయాన్ని పాత్రికేయులు ప్రస్తావించారు. ఆలపాటికి మీరు మద్దతిస్తారా? అంటే.. తప్పకుండా. త్వరలోనే ఆయన కోసం ప్రచారం కూడా చేస్తా! అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ స్థానాన్ని ఆలపాటి త్యాగం చేసిన విషయం తెలిసిందే. నాదెండ్ల మనోహర్ కోసం.. ఆలపాటి పోటీ నుంచి తప్పుకొన్నారు. అంతేకాదు.. ఓటర్లను కూడా కూడగట్టి మనోహర్ గెలుపు కోసం ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఆలపాటి రుణం తీర్చుకునేందుకు నాదెండ్ల రంగంలోకి దిగుతున్నారు. పట్టభద్రు లతో ఓట్లు వేయించడం కోసం.. తాను త్వరలోనే ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తొలి ఓటు తానే వేస్తానని కూడా మంత్రి చెప్పడం గమనార్హం. తద్వారా.. జనసేనను టీడీపీతో మమేకం చేసేం దుకు నాదెండ్ల ప్రయత్నిస్తున్నట్టు అయింది. ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలు జోరుగా సాగుతున్న క్రమంలో నాదెండ్ల చేసిన ప్రకటన ఫలిస్తుందన్నది ఆలపాటి వర్గం చెబుతున్న మాట.
ఇక, జిల్లాల వారీగా చూస్తే.. గుంటూరులో ప్రత్యేక శిబిరాలు పెట్టి గత 15 రోజులుగా ఆలపాటి ఓటర్లను చేర్పిస్తున్నారు. అయితే.. ప్రతిపక్షం నుంచి ఇంకా ఎవరూ నిలబడకపోవడం.. పోటీ ఎలా ఉంటుందో తెలియక పోవడంతో ఇప్పుడు కూటమి పార్టీల మద్దతు చాలా అవసరం గా మారింది. ఈ నేపథ్యంలో ఆలపాటి కోరకుండానే మంత్రి నాదెండ్ల స్పందించడం ఒకరకంగా బూస్ట్ ఇచ్చినట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.