చైనా సరిహద్దుల్లో ఆ ఘటన తర్వాత మరో దారుణ విషాదం!
ఈ తర్వాత లద్దాక్ ప్రాంతంలో ఇప్పుడే భారీగా సైనికులు మరణించారు.
By: Tupaki Desk | 29 Jun 2024 9:14 AM GMTచైనా సరిహద్దుల్లోని భారత కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్ లో భారత సైన్యంలో విషాదం సంభవించింది. ఆకస్మాత్తుగా వరదలు రావడంతో ఐదుగురు భారత జవాన్లు అశువులు బాశారు. గతంలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో పదుల సంఖ్యలో భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ తర్వాత లద్దాక్ ప్రాంతంలో ఇప్పుడే భారీగా సైనికులు మరణించారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. లద్దాక్ పరిధిలో చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో న్యోమా–చుషుల్ ప్రాంతంలో భారత సైన్యం యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు చేస్తుండగా ఈ దారుణ విషాదం చోటు చేసుకుంది. యుద్ధ విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకులతో బోధి నదిని దాటుతుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలు సంభవించాయి. దీంతో నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో టీ–72 యుద్ధ ట్యాంక్ నీట మునిగింది.
ఈ ఘటన లే‹ß æకు 148 కిలోమీటర్ల దూరంలో దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో జరిగింది. దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిని దాటే ట్యాంక్ విన్యాసాలు చేస్తుండగా.. ఒక్కసారిగా నదిలో నీటి పరిమాణం పెరిగింది. ఈ ఘటనలో టీ–72 యుద్ధ ట్యాంక్‌కు ప్రమాదం జరిగినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
కాగా ప్రమాద సమయంలో ఐదుగురు ఆర్మీ జవాన్లు యుద్ధ ట్యాంక్ లో ఉన్నారు. వీరిలో ఒకరు జూనియర్ కమిషన్డ్ అధికారి కాగా మరో నలుగురు జవాన్లు.
ఈ క్రమంలో టీ–72 యుద్ధ ట్యాంకులో ఉన్న ఐదుగురు జవాన్లు నదిలో గల్లంతయ్యారు. అప్రమత్తమైన మిగతవారు వెంటనే రంగంలోకి దిగారు. కొట్టుకుపోయిన జవాన్ల కోసం గాలించగా ఐదుగురు మృతదేహాలు లభించాయి. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు. ఆకస్మాత్తుగా సంభవించిన వరదలతో నీటి మునిగి ఐదుగురు సైనికులు మరణించారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. గాలింపు చర్యల్లో ఒక్క జవాన్ మృతదేహం లభించింది. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా నదిలో మునిగి ఐదుగురు జవాన్లు మృతి చెందడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్ తో నదిని దాటుతుండగా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. దేశం కోసం మన సైనికుల అందిస్తున్న సేవలను ఎన్నడూ మర్చిపోలేమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశమంతా వారికి అండగా ఉంటుందన్నారు.