Begin typing your search above and press return to search.

దేశ ప్రధానినే రంగంలోకి దింపిన డిస్కౌంట్స్ స్కామ్... ఎక్కడ?

అప్పటికే ఓ వస్తువుపై ఉన్న ధరను పెంచడం.. తర్వాత ఆ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం..

By:  Tupaki Desk   |   1 Oct 2024 11:30 PM GMT
దేశ ప్రధానినే రంగంలోకి దింపిన డిస్కౌంట్స్  స్కామ్... ఎక్కడ?
X

అప్పటికే ఓ వస్తువుపై ఉన్న ధరను పెంచడం.. తర్వాత ఆ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం.. ఇలా డిస్కౌంట్ల పేరుతో ఇప్పుడు ఆస్ట్రేలియాలో భారీ స్కామ్ జరుగుతుందని అంటున్నారు. ఈ స్కామ్ ను నివారించేందుకు ఏకంగా ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రంగంలోకి దిగారు. ఈ సమయంలో... ఏసీసీసీ తీసుకొచ్చిన జంట వ్యాజ్యలను ప్రస్థావించారు!

అవును... ఆస్ట్రేలియాలో సూపర్ మార్కెట్లు సాధారణ ఉత్పత్తులపై ప్రత్యేక ట్యాగ్ లను ఉంచేముందు వాటి ధరలను తాత్కాలికంగా పెంచుతున్నాయని ఆరోపించబడ్డాయి. ఈ సమయంలో... ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) జంట వ్యాజ్యాలను తీసుకొచ్చింది.

అక్కడి సూపర్ మార్కెట్లు డిస్కౌంట్స్ ఇచ్చే ముందు ప్రొడక్ట్స్ లేబుల్స్ ని మార్చేస్తున్నాయని వాచ్ డాగ్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆంథోనీ ఆల్బనీస్ తన తోటి పార్లమెంట్ సభ్యురాలు మేరీ డొయల్ తో పాటు మరికొందరితో ఈ విషయంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ప్రధాన సూపర్ మార్కెట్లలో ఏమి జరుగుతుందో అదే విషయంపై ఆస్ట్రేలియన్లు సరిగ్గానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని ఆల్బనీస్ అన్నారు. సూపర్ మార్కెట్ లలో వాటి ధరను డాలర్ తో పెంచుతూ.. ఉదాహరణకు 50 సెంట్లు తగ్గిస్తున్నాయని.. అంటే వాస్తవ ధరకంటే 50 సెంట్లు ఎక్కువ ధరకే అమ్ముతున్నా.. డిస్కౌంట్ ఇచ్చినట్లు చెబుతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా... ఇది ఆస్ట్రేలియన్ మార్గం కాదని.. ఇది నిజాయి కాదని.. ఇది సరైంది కాదని.. అందుకే ఏసీసీసీ ఈ వ్యవహారంపై సీరియస్ గా చర్యలు తీసుకోటోందని తెలిపారు. ధరల విషయంలో తీవ్రమైన ఉల్లంఘలనకు గానూ మిలియన్ డాలర్ల జరిమానా ఉంటుందని అన్నారు!

ఈ సమయంలో... బూటకపు తగ్గింపుల కుంభకోణం నేపథ్యంలో.. కిరాణా దిగ్గజాలపై దాడిని వేగవంతం చేసేందుకు ప్రధాన మంత్రి ఆల్బనీస్... మంగళవారం ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) కి నిధుల ప్రకటించనున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆల్బనీస్... ఈ రోజు మేము మోసపూరిత సూపర్ మార్కెట్ పదాతులపై అణిచివేతను ప్రకటిస్తున్నట్లు తెలిపారు.