Begin typing your search above and press return to search.

తండ్రికి తీసుపోని కూతురు.. ఆలియా వ్యాపారాన్ని సగం కొనేసింది

దేశీయ కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో దర్శనమిస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 4:13 AM GMT
తండ్రికి తీసుపోని కూతురు.. ఆలియా వ్యాపారాన్ని సగం కొనేసింది
X

తండ్రికి ఏ మాత్రం తీసిపోని ఆణిముత్యంగా మారుతోంది ఇషా అంబానీ. దేశీయ కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో దర్శనమిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ బాధ్యతల్ని ఆమెకు గత ఏడాది అప్పజెప్పటం.. అప్పటి నుంచి ఆమె తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు కంపెనీకి వరంలా మారుతున్నాయి. తాజాగా ఆమె ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియాభట్ కు చెందిన కంపెనీలో యాభై ఒక్క శాతం వాటాను సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఆలియా బట్టల బ్రాండ్ పై రిలయన్స్ కన్నేసిందని.. డీల్ కుదురుతుందన్న వాదన వినిపించినప్పటికీ.. అధికారికంగా రియాక్టు కాలేదు. తాజాగా.. అదికారికంగా వాటాను సొంతం చేసుకున్న వేళ.. దీనికి సంబంధించిన వివరాల్ని ఇషా పంచుకున్నారు. ఎడ్ - ఎ - మమ్మా బ్రాండ్ వ్యవస్థాపకురాలు ఆలియాభట్ ను తానెప్పుడూ ఆరాధిస్తానని చెప్పిన ఆమె.. తన ప్రెగ్నెన్సీ టైంలో ఆమె బ్రాండ్ దుస్తుల్నే దరించినట్లుగా చెప్పుకొచ్చారు. తమ పిల్లలు సైతం ఈ బ్రాండ్ దుస్తుల్ని ధరిస్తారని చెప్పారు.

అలాంటి సంస్థలో తాము భాగస్వామ్యం కావాటం సంతోషంగా ఉందన్నారు. ఇంతకీ ఆలియా భట్ దుస్తుల బ్రాండ్ వివరాల్లోకి వెళితే.. 2020లో తాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్ుడు చిన్నారుల కోసం ఎడ్ ఎ మమ్మా బ్రాండ్ పేరుతో దుస్తుల అమ్మకాల్ని మొదలుపెట్టింది. ఈ వ్యాపారం షురూ చేసిన ఏడాదిలోనే కంపెనీ విలువ రూ.150 కోట్ల మార్కును దాటటం ఒక విశేషం. ఇక.. ఇందులో రెండేళ్ల వయసు నుంచి పన్నెండేళ్ల లోపు చిన్నారుల దుస్తుల్ని కూడా విక్రయిస్తుంటారు. ఈ వెబ్ సైట్ లో దాదాపు 800 వరకు వస్తువుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవిశేషం ఏమంటే.. ఈ బ్రాండ్ స్వదేశీ బ్రాండ్లను అమ్మటంతో పాటు.. తమ ఉత్పత్తులన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండటం గమనార్హం.

ప్రెగ్నెన్సీ మహిళలకు.. చిన్నారులకు నాణ్యమైన వస్తువుల్ని అందించాలన్నదే తమ ఇద్దరి కలగా పేర్కొన్న ఆమె.. తామిద్దరం ‘అమ్మలు’ కావటంతో వ్యక్తిగతంగా ఇదెంతో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆలియా బ్రాండ్ తో కలిసి తాము తమ వ్యాపారాన్ని విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు. ఏమైనా.. తన ప్రెగ్నెన్సీలో వాడిన బ్రాండ్ దుస్తుల కంపెనీలో మెజార్టీ వాటాను సొంతం చేసుకున్న ఇషా తీరు చూస్తే.. తండ్రికి ఏ మాత్రం తీసిపోని కుమార్తెగా చెప్పకతప్పదు.