వైసీపీ నేత ఆళ్లకు సౌండ్ తీసేసిన సుప్రీంకోర్టు.. భారీ షాక్
అంతేకాదు.. ఆళ్ల దాఖలు చేసిన రెండు పిటిషన్‌లను కొట్టి వేసింది.
By: Tupaki Desk | 21 Aug 2024 4:56 PM GMTవైసీపీ సీనియర్ నాయకుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. అసలు ఆయనకు సౌండ్ లేకుండా చేసేసిందంటేనే సరిపోతుంది. ``కోర్టులతో ఆడుకోవద్దు`` అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ``పొలిటికల్ గేమ్‌లోకి కోర్టులను లాగాలని చూస్తే.. మేమిచ్చే షాక్ నుంచి కోలుకోవడం కష్టం`` అని ఆళ్ల తరఫు న్యాయవాదికి తేల్చి చెప్పింది. ``రాజకీయంగా మీరు ఎంత బలమైన వ్యక్తులైనా కావొచ్చు. కోర్టుల దగ్గరకు వచ్చేసరికి సాధారణ పౌరులు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయి``అని హెచ్చరించింది. అంతేకాదు.. ఆళ్ల దాఖలు చేసిన రెండు పిటిషన్‌లను కొట్టి వేసింది. ఇకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
విషయం ఏంటి?
2017లో తెలంగాణలో వెలుగు చూసిన `ఓటుకు నోటు` కేసు విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ.. అప్పట్లో రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టారు. ఈ క్రమంలో `బ్రీఫ్‌డ్‌మీ` అన్న వాయిస్ చంద్రబాబుదేనని వెలుగు చూసింది. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. ప్రస్తుతం ఇవి విచారణ దశలో ఉన్నాయి. అయితే.. ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ.. వైసీపీ నాయకులు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో కొన్నేళ్ల కిందటే పిటిషన్(ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేశారు.
అదేవిధంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబును `ప్రధాన నిందితుడిగా` చేర్చాలని, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రెండో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండుపిటిషన్లు ఒకే కేసుకు(ఓటుకునోటు) సంబంధించినవి కావడంతో సుప్రీంకోర్టు రెండూ కలిపి విచారిస్తామని అప్పట్లో పేర్కొంది. తాజాగా ఈ పిటిషన్లు బుధవారం సాయంత్రంకోర్టులో విచారణకు వచ్చారు. పిటిషన్లపై జస్టిస్ సుందరేశన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆళ్ళ వేసిన పిటీషన్లు పూర్తిగా రాజకీయ కక్షతో కూడుకున్నవేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజకీయ కక్షలు ఉంటే బయట చూసుకోవాలని, కోర్టులను వేదికగా చేసుకోవద్దని తీవ్రస్వరంతో హెచ్చరించింది.
అంతేకాదు.. రాజకీయంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎవరు? ఎన్నాళ్ల నుంచి రాజకీయం చేస్తున్నారు? ఆయన బ్రాక్ గ్రౌండ్, పార్టీ సహా.. ఇతర అంశాలను కూడా ప్రశ్నించింది. అనంతరం.. న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టులతో ఆడుకుంటే.. షాక్ తప్పదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆళ్ల వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేయడంతో తీవ్రంగా మందలించింది. ఇకపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఆచితూచి వేయాలని సూచించింది.