Begin typing your search above and press return to search.

భార్యా భ‌ర్త‌ల సె* పై మ‌రో సంచ‌ల‌న తీర్పు!

ఇక‌, ఇప్పుడు తాజాగా అల‌హాబాద్ కోర్టు మ‌రో సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. భార్య అనుమ‌తి లేకున్నా.. ఆమెతో ఎలాంటి శృంగార భంగిమ‌నైనా చేయొచ్చ‌న‌ని తేల్చి చెప్పింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 3:55 AM GMT
భార్యా భ‌ర్త‌ల సె* పై మ‌రో సంచ‌ల‌న తీర్పు!
X

దేశంలోని అనేక కోర్టులు ఇటీవ‌ల కాలంలో భార్యా భ‌ర్త‌ల శృంగారంపై అనేక తీర్పులు ఇస్తున్నాయి. వీటిలో దేనిని పాటించాలో.. దిగువ కోర్టులు దేనిని దిశానిర్దేశంగా తీసుకోవాలో ఒకింత క‌న్ఫ్యూజ్‌గా మారుతోంద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గ‌తంలో మ‌ద్రాసు హైకోర్టు ఓకేసు విచార‌ణ చేసి.. భార్య అనుమ‌తి లేకుండా భ‌ర్త శృంగారం చేయ‌డం త‌ప్ప‌ని, దీనిని అత్యాచారంగానే భావించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. అంతేకాదు, స‌ద‌రు కేసులో భ‌ర్త‌కు భారీ జ‌రిమానా కూడా విధించింది. ఆ త‌ర్వాత కాలంలో కేర‌ళ హైకోర్టు మ‌రో సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

భార్యా భ‌ర్త‌ల శృంగారంలో అస‌హ‌జ శృంగారాన్ని అనుమ‌తించ‌బోమ‌ని.. దీనిని తీవ్ర‌మైన వేధింపులు, సెక్స్ అబ్యూజివ్‌గా చూడాల్సి ఉంటుంద‌ని.. భ‌ర్త ఏ స్థితిలో ఉన్నా అస‌హజ శృంగారానికి భార్య అనుమ‌తి లేకుంటే.. త‌ప్ప‌ని పేర్కొంటూ కేర‌ళ హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. ముంబై హైకోర్టు మ‌రో తీర్పు చెప్పింది. భార్య కోరిక తీర్చ‌డం భ‌ర్త వైవాహిక క‌ర్త‌వ్యంగా పేర్కొంది. ఈ విష‌యంలో భార్య అసంతృప్తికి గురైతే.. ఆమె విడాకులు పొందే అర్హ‌త ఉన్న‌ట్టేన‌ని తేల్చి చెప్పింది. దంప‌తుల‌కు విడాకులు కూడా మంజూరు చేసింది.

ఇక‌, ఇప్పుడు తాజాగా అల‌హాబాద్ కోర్టు మ‌రో సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. భార్య అనుమ‌తి లేకున్నా.. ఆమెతో ఎలాంటి శృంగార భంగిమ‌నైనా చేయొచ్చ‌న‌ని తేల్చి చెప్పింది. అయితే.. భార్య వ‌య‌సు 18 ఏళ్లు నిండి ఉండాల‌ని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. భార్య అనుమ‌తి తీసుకునేందుకు.. భ‌ర్త‌కు అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పింది. అస‌హ‌జ శృంగారం చేయాల‌ని.. భ‌ర్త ఒత్తిడి తెస్తున్నాడ‌న్న భార్య వాద‌న‌ను కూడా తోసిపుచ్చింది.

దానిని కూడా శృంగారంలో ఒక భంగిమ‌గానే సైన్స్ చెబుతోంద‌ని వ్యాఖ్యానించింది. పెళ్లి అయిన వెంట‌నే భార్యాభ‌ర్త‌లు ఒక‌రిపై ఒక‌రికి లైంగిక బంధానికి సంబంధించిన హ‌క్కులు వ‌ర్తిస్తాయ‌ని, దీనిలో అనుమ‌తితో ప‌నిలేద‌ని తేల్చి చెప్పింది. దీంతో ప‌లు హైకోర్టులు ఇలా భార్యా భ‌ర్త‌ల శృంగారంపై ఇచ్చిన తీర్పులు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.