Begin typing your search above and press return to search.

ప్రభుత్వ భూముల మేటర్... వైసీపీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి పిలుపు!

ఈ సమయంలో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   22 Feb 2025 6:40 AM GMT
ప్రభుత్వ భూముల మేటర్... వైసీపీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి పిలుపు!
X

అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. పలు ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు! ఈ సమయంలో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... వైసీపీ రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఫిర్యాదులు అందాయని అంటున్నారు. దీంతో.. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. నేడు ఆకేపాటి కుటుంబం జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... అన్నమయ్య జిల్లా ఆకేపాడు, మందపల్లి రెవెన్యూ గ్రామాల్లో పలు ఎకరాల ప్రభుత్వ భూముల్ని వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరుతో దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

ఇందులో భాగంగా.. ప్రభుత్వ భూములను ముందుగా ఎస్సీ, ఎస్టీల పేరిట రాయించి, ఆ తర్వాత వాటిని తన పేరిట రాయించుకునేవారని కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు. ఈ భూముల్లో ఉన్న కాలనీలను ఖాళీ చేయించి, స్కూలు నిర్మాణం చేపట్టి, అనంతరం దాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

ఈ క్రమంలో ఆ భూముల్లో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి పేరిట టీటీడీ నిధుల ద్వారా కల్యాణ మండపం నిర్మించారని.. ఆకేపాడులో సర్వే నెంబర్ 56/1లో సుమారు 1.5 ఎకరాల భూమిని రాయించుకున్నారని.. ఈ క్రమంలో కల్యాణ మండపం ఉన్న భూమిని భార్య జ్యోతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే గతంలోనూ కొంత భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట రాయించుకోగా.. సీ.సీ.ఎల్.ఏ. జోక్యం చేసుకుని రద్దు చేసిందని చెబుతున్నారు. ఈ రద్దు సమయంలోనే కొన్ని సర్వే నెంబర్లు తప్పిపోగా.. ఆ భూములను తనతో పాటు తన భార్య, తమ్ముడు, మరదలు పేరిట పరస్పరం భూముల్ని బదలాయించుకుంటూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కుటుంబ సభ్యులు నేడు జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారని తెలుస్తోంది.