Begin typing your search above and press return to search.

వీడేం భర్త సామి.. న్యూడ్ కాల్స్ చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు

తన భర్త చేసే తప్పుడు పనుల జాబితాను చెప్పటమే కాదు.. తనకు జరుగుతున్న అన్యాయం మీద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

By:  Tupaki Desk   |   16 Feb 2025 5:04 AM GMT
వీడేం భర్త సామి.. న్యూడ్ కాల్స్ చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు
X

బంధాలు.. అనుబంధాల రూపురేఖలు మారిపోతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి. భార్యను కొందరు భర్తలు చూసే తీరు.. అనుసరించే విధానాల్ని చూస్తే.. దేవుడా.. అనుకోకుండా ఉండలేం. అలాంటి కోవకు చెందిన మరో ఉదంతం తెర మీదకు వచ్చింది. తిరుపతికి చెందిన ఒక ఇల్లాలు తాజాగా పోలీసుల్ని ఆశ్రయించింది. తన భర్త చేసే తప్పుడు పనుల జాబితాను చెప్పటమే కాదు.. తనకు జరుగుతున్న అన్యాయం మీద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తిరుపతి జిల్లాకు చెందిన బాధితురాలు.. కరోనా వేళ దారుణంగా మారిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఒక ప్రైవేట్ యాప్ లో న్యూడ్ కాల్స్ మాట్లాడాలని చెప్పాడన్నారు. అలా చేస్తే డబ్బులు వస్తాయని నచ్చజెప్పి.. ఆ పని చేయించాడన్న ఆమె.. ‘‘నా చేత అలా మాట్లాడించి డబ్బులు సంపాదించాడు. రెండేళ్లలో రూ.18 లక్షలు వచ్చాయి. దీంతో ఇక నుంచి ఆ పని చేయనని తేల్చి చెప్పా. దీంతో భౌతిక దాడులకు పాల్పడుతున్నాడు’’ అంటూ ఆమె వాపోయారు.

కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారని.. దీంతో నింద తన మీద వేసిన భర్త.. కుటుంబ సభ్యులు తనను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారన్నారు. తనపై భర్త దాడికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు. ‘‘నా పిల్లల్ని సైతం చూడనివ్వటం లేదు. ఇదే అంశంపై రామచంద్రాపురం పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేశా. కానీ ఎలాంటి స్పందన లేదు. అదే స్టేషన్ లో విధులు నిర్వర్తించే ఒక పోలీసు కానిస్టేబుల్ ఒకరు అసభ్య మెసేజ్ లు పంపుతున్నాడు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. ఆ కానిస్టేబుల్ తీరు మీద విచారణ చేయాలి’ అంటూ తనకు ఎదురవుతున్న సమస్యల గురించి ఏకరువు పెట్టారు. వీడేం భర్త.. భార్య చేత ఇలా చేయటమా? అంటూ ఈ ఉదంతం గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.