Begin typing your search above and press return to search.

ఆ కోవర్టు కోమటిరెడ్డేనా ?

నాతో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ చెప్తున్న మాటలు నిజమే కావచ్చు

By:  Tupaki Desk   |   22 April 2024 12:54 PM GMT
ఆ కోవర్టు కోమటిరెడ్డేనా ?
X

‘’నాతో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ చెప్తున్న మాటలు నిజమే కావచ్చు. అందులో 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చేది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కావచ్చు. అందుకే రేవంత్ వెంకట్ రెడ్డిని సీఎం అని అంటున్నాడు. లేదంటే ఓటుకునోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లొచ్చు. అందుకే ముందస్తుగా కోమటిరెడ్డిని రేవంత్ సీఎంగా ప్రకటించాడు’’ అని బీజేపీ తెలంగాణ శాసనసభా రక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయమంటే దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని, ఆగస్ట్ 15కు రుణమాఫీ చేస్తానన్న రేవంత్ ఆగస్ట్ సంక్షోభంలో కొట్టుకుపోతాడమే అందుకే ఆ మాటలు అంటున్నాడని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తావని చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారని, వారిని మోసం చేయొద్దని అన్నారు

రాష్ట్రంలో ఒకవైపు నీళ్లు లేక పంట ఎండిపోతుంటే మరోవైపు మార్కెట్ కు వచ్చిన పంటలను కొనుగోలు చెయ్యకపోవడం బాధాకరం. తడిచిన ధాన్యం కొంటా అన్నారు కానీ ఆ ఊసే ఎత్తడం లేదు అని ఆయన విమర్శించారు.

రేవంత్, కోమటిరెడ్డిలు ఉప్పు, నిప్పులా ఉన్నారు. గతంలో రేవంత్ కోమటిరెడ్డి మీద నేరుగా ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా రేవంత్ పీసీసీ పదవి కొనుక్కున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్ నోటి నుండి నా తర్వాత సీఎం అయ్యే అర్హత ఉన్నది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే అని చెప్పడం ఆశ్చర్యకరమే.