Begin typing your search above and press return to search.

విప్ పోస్టులలో కూటమి కొత్త రికార్డు ?

అయితే విప్ పోస్టులలో ఇంత మంది ఉండాలన్న నిబంధన ఏదీ రాజ్యాంగం ప్రకారం లేదు అని అంటున్నారు. దాంతో ఎంత మంది ని అయినా విప్ లుగా చేయవచ్చు.

By:  Tupaki Desk   |   14 Nov 2024 3:47 AM GMT
విప్ పోస్టులలో కూటమి కొత్త రికార్డు ?
X

ఏపీ అసెంబ్లీలో ఏకంగా 15 మంది కొత్త విప్ లను నియమించారు. వారితో పాటు ఒక చీఫ్ విప్ ఉన్నారు. అయితే చీఫ్ విప్ గా నియమితులైన జీవీ ఆంజనేయులుకు కేబినెట్ ర్యాంక్ దక్కింది. మిగిలిన విప్ లకు ఒక స్టాటస్ గానే ఉంటుంది తప్ప ఎటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఉండవని విశ్లేషకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే మొత్తం 15 మంది విప్ పోస్టులలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కాబట్టి మూడు పార్టీలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఎక్కువ మందినే తీసుకున్నారు.

ఇది చాలా ఆసక్తికరమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో 294 సీట్లు ఉంటే అక్కడ కూడా ఇంత మంది విప్ పోస్టులు లేవని గుర్తు చేస్తున్నారు. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో 15 మంది విప్ పోస్టులు అంటే ఆశావహులకు న్యాయం చేసినట్లుగా చూపించడమే అని అంటున్నారు.

అయితే విప్ పోస్టులలో ఇంత మంది ఉండాలన్న నిబంధన ఏదీ రాజ్యాంగం ప్రకారం లేదు అని అంటున్నారు. దాంతో ఎంత మంది ని అయినా విప్ లుగా చేయవచ్చు. దాంతోనే కూటమిలోని ఆశావహులను దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా చేశారు అని అంటున్నారు.

అయితే ఆనవాయితీ ప్రకారం ప్రతీ 45 మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు విప్ లు ఉంటారని అంటున్నారు. అంటే ఈ లెక్కన కూటమి లో ఎనిమిది మంది దాకా విప్ పోస్టులు ఇవ్వవచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ దానికి రెట్టింపు ఇచ్చారు అంటే రాజకీయంగా అవకాశాలు కల్పించడం కోసమే అని అంటున్నారు. గత వైసీపీ హయాంలోనూ విప్ లు ఎక్కువగానే ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వైసీపీని కూడా ఈ విషయంలో మించిపోయింది అని అంటున్నారు.

ఇక విప్ లు చేసే పని ఏమి ఉంటుంది అంటే ఓటింగ్ సమయంలో తమ పార్టీ వారు ఠంచనుగా సభకు హాజరయ్యేలా చూడడం,వారి చేత సవ్యంగా ఓటు వేయించడం పార్టీ ఇచ్చిన లైన్ ని దాటకుండా చూసుకోవడం అని అంటున్నారు.

అయితే ఏపీలో కూటమికి భారీ మెజారిటీ ఉంది. ఈ సమయంలో ఇంతటి బలమైన ప్రభుత్వాన్ని కాదని ఎవరూ గీతా దాటే చాన్సే లేదని అంటున్నారు. అందువల్ల ఇద్దరు ముగ్గురు విప్ లు ఉంటే సరిపోతుందని కూడా అంటున్నారు. కానీ ముందే చెప్పినట్లుగా దానిని కూడా పదవిగా చూపించి న్యాయం చేశామని చెప్పుకోవడానికే ఈ విధంగా నంబర్ ని పెంచుకుంటూ పోయారని అంటున్నారు. అయితే విప్ అన్నంత మాత్రాన వారికి ఎమ్మెల్యేకు ఉండే ప్రివిలేజెస్ మాత్రమే ఉంటాయి తప్ప ప్రత్యేక రాయితీలు ఏమీ ఉండవని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.