Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త జిల్లాలు...కూటమి స్ట్రాంగ్ డెసిషన్ !

ఏపీలో కొత్త జిల్లాలు మరిన్ని ఏర్పాటు అవుతాయా అన్నది చర్చగా ఉంది.

By:  Tupaki Desk   |   7 March 2025 2:59 PM IST
ఏపీలో కొత్త జిల్లాలు...కూటమి స్ట్రాంగ్ డెసిషన్ !
X

ఏపీలో కొత్త జిల్లాలు మరిన్ని ఏర్పాటు అవుతాయా అన్నది చర్చగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటుతోంది. టీడీపీ 2022లో వైసీపీ ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసిన తీరు పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు చేసింది. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగలేదని కూడా హాట్ కామెంట్స్ చేసింది.

దాని వల్ల తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా పాలన మరింత ఇబ్బందికరంగా మారిందని కూడా టీడీపీ సహా నాటి విపక్షాలు ద్వజమెత్తాయి. దాంతో పాటు చాలా చోట్ల తమకు కొత్త జిల్లాలు కావాలని డిమాండ్లు వచ్చాయి. అలాగే జిల్లా కేంద్రాలను మార్చాలని కూడా కోరుతూ వచ్చారు.

దీంతో తాము అధికారంలోకి వస్తే ఈ అన్యాయాలను సరిచేస్తామని టీడీపీ చెప్పింది. ఇపుడు తీరా అధికారంలోకి వచ్చి ఏడాదికి దగ్గర పడుతున్న వేళ కొత్త జిల్లాల గురించి టీడీపీ కూటమి ఆలోచనలు ఏమిటి అన్నది అంతా చర్చిస్తున్నారు. అయితే కొత్త జిల్లాల విషయంలో ఎలాంటి ఆలోచనలు లేవని కొత్త జిల్లాలు అన్నవి ఉండవని శాసనమండలిలో రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు.

ఆయన మండలిలో కొందరు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కొత్త జిల్లాలు ఏర్పాటు అన్న ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పైగా ఆయన వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఎటువంటి శాస్తీయమైన విధానం లేకుండా నాటి ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని అన్నారు. అంతే కాదు కేబినెట్ లో కూడా ఈ అంశం పెట్టి డిస్కషన్ చేయలేదని అన్నారు. ఈ పరిణామాల వల్లనే సమస్యలు తలెత్తాయని అన్నారు.

అయితే తాము మాత్రం కొత్త జిల్లాల జోలికి పోవడం లేదని మంత్రి క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో మర్కాపురం జిల్లాగా చేయాలని డిమాండ్ ఉంది. అలాగే అల్లూరు జిల్లా నుంచి రంప చోడవరాన్ని వేరు చేసి కొత్త జిల్లాగా ప్రకటిస్తారని భావిస్తూ డిమాండ్ చేస్తున్నారు. అల్లూరు జిల్లా కేంద్రం అయిన పాడేరుకి అది బహు దూరమని అక్కడి వారి ఆలోచన.

ఇక రాయలసీమలో కొత్త జిల్లాల కోరిక ఉంది. ఉత్తరాంధ్రాలో బొబ్బిలిని కొత్త జిల్లాగా చేయాలని కోరుతున్న వారూ ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో కొత్త జిల్లాలను కనుక పట్టుకుంటే తేనేతుట్టెను కదిపినట్లే అన్న ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయని అంటున్నారు.

అందుకే ఆ విషయం మీద ప్రభుత్వం ముందుకు పోవడం లేదని అంటున్నారు. అయితే టీడీపీ పొలిట్ బ్యూరోలో మాత్రం గత నెలలో కొత్త జిల్లాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. కానీ ఆ తరువాత ఏమి ఆలోచించారో తెలియదు కానీ మంత్రి నుంచి ఈ రకమైన స్టేట్మెంట్ వచ్చింది అని అంటున్నారు.

వైసీపీ విషయం తీసుకుంటే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయడం వల్ల సరిహద్దులు మారాయి. ఇబ్బందులు వచ్చాయి. దూరాలూ భారాలూ పెరిగాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే జిల్లా కేంద్రం మార్చాలని అప్పట్లోనే డిమాండ్లు వచ్చాయి.

కానీ కూటమి ప్రభుత్వం వీటిని ఇపుడు పక్కన పెట్టినట్లుగా ఉంది. అదే సమయంలో కొత్తగా అద్దనికి, మడకశిర, ఎమ్మిగనూరు, ఉదయగిరిలను కొత్తగా రెవిన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందని అంటున్నారు. సో కొత్త జిల్లాల ముచ్చట్లు కూటమి ప్రభుత్వం ఇప్పట్లో చేయదనే అంటున్నారు. డీలిమిటేషన్ జరిగి కొత్తగా ఎంపీ సీట్లు పెరిగిన తరువాత మారిన భౌగోళిక నైసర్గిక పరిస్థితులను గమనంలోకి తీసుకుని భవిష్యత్తులో ఏమైనా చేసే వీలు ఉంది అని అంటున్నారు.