టార్గెట్ జగన్.. బాబు పెద్ద వ్యూహం ..!
కనీసం ముందస్తు బెయిళ్లు కూడా దక్కకుండా.. బలమైన సెక్షన్లు బనాయిస్తుండడం గమనార్హం. మరోవై పు.. పార్టీ అధినేత జగన్‌కు కూడా ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేస్తుండడం విశేషం.
By: Tupaki Desk | 4 April 2025 5:30 PMవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను మరింత ఇరుకున పెట్టేలా.. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక రాజకీ యాలకు తెరదీసిందా? ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా వ్యవహరించనుందా? అంటే..ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు.. పార్టీ పరంగా.. మరోవైపు.. నాయకుల పరంగా కూటమి సర్కారు ఉచ్చు బిగించేందుకుప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కీలక నాయకుల పై కేసులు పెట్టి.. ఇరుకున పడేలా చేస్తోంది.
కనీసం ముందస్తు బెయిళ్లు కూడా దక్కకుండా.. బలమైన సెక్షన్లు బనాయిస్తుండడం గమనార్హం. మరోవై పు.. పార్టీ అధినేత జగన్‌కు కూడా ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేస్తుండడం విశేషం. ఈ క్రమంలో ఒకే రోజు ఇద్దరు కీలక నాయకులు.. జగన్‌ను సెంట్రిక్‌గా చేసుకుని.. కామెంట్లు చేయడం గమనార్హం. టీడీపీకే చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత... తన భర్త హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును తిరగదోడాల్సిన అవసరం ఉందన్నారు.
దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. అంతటితో కూడా ఆమె ఆగకుండా.. తన భర్త పరిటాల రవి హత్య వెనుక జగన్ ఉన్నారని తీవ్ర ఆరోపణలు సంధించారు. ఈ కేసును కాంగ్రెస్ హయాంలో విచార ణ చేయడంతోనే తమకు సంపూర్ణ న్యాయం దక్కలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసును పునర్విచారి స్తే.. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం ఉందన్నారు. అంటే.. ఈ కేసును ఈ రోజు కాకపోయినా .. త్వరలోనే తిరికి పునర్విచారణకు అనుమతించే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. జగన్‌కు చిక్కులు తప్పవు.
ఇక, మరో నేత.. కాంగ్రెస్ ఏపీ చీఫ్.. షర్మిల.. తన బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యకేసుకు సంబం ధించి జగన్ కేంద్రంగా విరుచుకుపడ్డారు. వివేకా కుమార్తె.. డాక్టర్ నర్రెడ్డి సునీతను కూడా హత్య చేసే అవకాశం ఉందన్నారు. ఇంత చేసిన వారు.. ఆమెను మాత్రం ఎలా వదిలి పెడతారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కడప ఎంపీ.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే.. తప్ప.. ఎవరికీ మనస్సాంతి లేదన్నారు. అదేసమ యంలో పెద్ద వారిని కూడా.. ఈ కేసులో పేర్కొనాలంటూ.. జగన్ పేరును ఆమె ప్రస్తావించారు. ఇదే జరిగితే.. జగన్ ఇరుకునపడడం ఖాయం.