Begin typing your search above and press return to search.

జగన్ వల్లే పొత్తుట....జనం యాక్సెప్ట్ చేస్తారా...?

అయితే బీజేపీతో దోస్తీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అనుకుంటున్నారు. దానికి ఆయన చెబుతున్న కారణం ఇపుడు ఇంటరెస్టింగ్ గా ఉంది.

By:  Tupaki Desk   |   29 Aug 2023 12:34 PM GMT
జగన్ వల్లే పొత్తుట....జనం యాక్సెప్ట్ చేస్తారా...?
X

ఏపీలో బీజేపీ అంటే జనాలకు ఆగ్రహం ఉందని కమ్యూనిస్టులు అంటూంటారు. వారు అనడం కాదు ఏపీ విభజన హామీలను వేటినీ బీజేపీ సక్రమంగా అమలు చేయలేదన్న ధర్మాగ్రహం జనంలో చాలానే ఉందని చెబుతారు. దానికి 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడమే కారణం. ఆ తరువాత కూడా లోకల్ బాడీస్ కి జరిగిన ఎన్నికల్లో ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి పెద్దగా ఓట్లు పడింది లేదు.

అంటే ఏపీ జనాలు బీజేపీ పట్ల విముఖంగా ఉన్నారనే లెక్క అంటున్నారు. అయితే బీజేపీతో దోస్తీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అనుకుంటున్నారు. దానికి ఆయన చెబుతున్న కారణం ఇపుడు ఇంటరెస్టింగ్ గా ఉంది. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ నెత్తిన పాలు పోసినట్లేనని ఇటీవలే సీపీఐ నేత రామక్రిష్ణ హాట్ కామెంట్స్ చేశారు.

మరి బీజేపీతో పొత్తు అన్న దానిని జస్టిఫికేషన్ చేయడం టీడీపీమీదనే ఆధారపడి ఉంది. అలా కనుక జనాలను ఒప్పిస్తే కనుక కచ్చితంగా ఈ పొత్తు సక్సెస్ అవుతుంది. దానికి పొత్తుల కంటే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో బాబు ఉన్నారని ఆయన మాటలను బట్టి అర్ధం అవౌతోంది. బీజేపీతో పొత్తులు అని డైరెక్ట్ గా చెప్పకుండా ఏపీని పూర్తిగా తిరిగి నిర్మించాలంటే కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో కలసి నడవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇక ఏపీని జగన్ సర్వనాశనం చేశారని కూడా జగన్ అంటున్నారు. తిరిగి ఏపీని గాడిలో పెట్టాలంటే కేంద్రం సాయం తప్పనిసరి అన్నది బాబు గారి వాదన. 2014లో విభజన గాయాలతో ఏపీ కునారిల్లిందని చెప్పి పొత్తులకు అప్పట్లో అంతా సెట్ చేశారు బాబు. ఆనాడు ఉమ్మడి ఏపీ విభజనకు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కారణం అయిందన్న మంట ఏపీ ప్రజలలో ఉంది. అయితే ఏపీలో ప్రజలకు బీజేపీ దండీగా సాయం చేస్తుందని చెప్పి ఒప్పించారు బాబు. అలా నాటి పొత్తులు సూపర్ సక్సెస్ అయ్యాయి.

ఇపుడు చూస్తే అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేయాలనుకుంటున్నారు. నిజానికి ఏపీకి బీజేపీని విలన్ ని చేయడంతో టీడీపీ పాత్ర 2019లో చాలా ఎక్కువ. ఆనాడు పనిగట్టుకుని ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందని బాబు ఊరూరా తిరిగి చాటారు. గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి అదే నోటితో ఏపీకి బీజేపీ అవసరం ఉందని కూడా ఇదే బాబు చెప్పబోతున్నారా అన్న చర్చ సాగుతోంది.

ఈసారి విభజన గాయాలు అంటే పాత మాట అవుతుంది జనాలకు ఎక్కదు కాబట్టి ఏపీని జగన్ విభజన కంటే కూడా ఎక్కువగా సర్వ నాశనం చేశారు కాబట్టి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ పార్టీ సాయం తీసుకోవాల్సిందే అంటూ ఒప్పిస్తారు అని అంటున్నారు. మరి ఏపీ జనాలు ఈ రకమైన వాదననలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది చూడాల్స్ది ఉంది. మొత్తానికి ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరితే దానికి జగనే కారణం అన్నట్లుగానే టీడీపీ వాదన ఉండబోతోంది అని అంటున్నారు.