కూటమి ఫస్ట్ బడ్జెట్ అపుడే...మెరుపులు ఎన్నో !
ముఖ్యంగా ఏపీలో ఇన్వెస్ట్మెంట్ల కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తోంది. కూటమి ప్రభుత్వం బడ్జెట్ నే ప్రవేశపెట్టలేకపోయింది అంటే దాని కంటే బాడ్ ఇమేజ్ వేరొకటి ఉండదని అంటున్నారు.
By: Tupaki Desk | 18 Aug 2024 2:30 PM GMTఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టలేదు అన్నది తెలిసిందే. జూలై నెలలో మరో నాలుగు నెలల కోసం ఓటాన్ అకౌంట్ కి గవర్నర్ అనుమతి తీసుకుని ఆర్డినెన్స్ ని తెచ్చింది. అయితే ఈ ఏడాది ఇంకా బిగిసి ఆరేడు నెలలు ఉంది. బడ్జెట్ ని ప్రవేశ పెట్టకపోతే దేశ చరిత్రలోనే ఏపీలో కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు. అది నెగిటివ్ గా కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది అని అంటున్నారు.
ముఖ్యంగా ఏపీలో ఇన్వెస్ట్మెంట్ల కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తోంది. కూటమి ప్రభుత్వం బడ్జెట్ నే ప్రవేశపెట్టలేకపోయింది అంటే దాని కంటే బాడ్ ఇమేజ్ వేరొకటి ఉండదని అంటున్నారు. అందుకే బడ్జెట్ ని మరో ఆరు నెలలకు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది అని అంటున్నారు.
వివిధ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా పంపాలని కూడా అందుకే కోరారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బడ్జెట్ కోసమే చంద్రబాబు తాజాగా ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. కేంద్రం చేసే సాయం కనుక కచ్చితంగా అవగాహన లోకి వస్తే బడ్జెట్ లో కొత్త మెరుపులు మెరిపించవచ్చు అని ఆలోచిస్తున్నారు.
ఈసారి బడ్జెట్ ని ఎలా తీర్చిదిద్దాలి ఏఏ అంశాలను ప్రాధాన్యతలుగా తీసుకోవాలి అన్న దాని మీద చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ ఈ నెల 28న మీట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ బడ్జెట్ లో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు. ఈ ఏడాదిలోగా సూపర్ సిక్స్ హామీలు ఎన్ని నెరవేర్చగలం అన్నది కూడా స్టడీ చేస్తున్నారు.
ఈ దసరా నాటికి ఉచిత బస్సు సదుపాయం మహిళలకు కల్పించాలని ఆలోచిస్తున్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలెండర్లను ఏడాదికి మూడు అన్నవి కూడా కేంద్ర సాయంతో అమలు చేయడం కోసం చూస్తున్నారు. అదే విధంగా రైతు భరోసాని ఏకంగా సంక్రాంతికి మార్చి ఇవ్వాలని చూస్తునారు. సంక్రాంతి రైతుల పండుగ కాబట్టి సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని యోచిస్తున్నారు.
అలాగే మరో నాలుగైదు నెలలకు ఆ హామీ అమలు చేయడం ద్వారా భారాన్ని అప్పటికి మోయగలిగే స్థితికి ఏపీ ఖజానా రావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టే బడ్జెట్ లో అమరావతి రాజధాని హైలెట్ గా ఉండబోతోంది అని అంటున్నారు.
అమరావతి రాజధానికి ఇప్పటికే 15 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర తెలిపిన సంగతి తెలిసిందే. ఆ నిధులతో ఒక స్టేజ్ దాకా అమరావతిని తేవచ్చు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కేంద్రం సైతం అంగీకరిస్తున్న నేపధ్యం ఉంది.
ఏపీ ప్రభుత్వం తన పలుకుబడితో పెట్టుబడులను ఎటూ ఆహ్వానిస్తోంది. అలాగే చాలా సంస్థలకు భూములను కూడా ఇస్తోంది. దాంతో అమరావతి రానున్న మూడు నాలుగేళ్లలో ఒక రూపునకు షెపునకూ వస్తుందని అంటున్నారు. ఈ విషయాలనే అడ్జేట్ లో చెప్పడం ద్వారా ఏపీ ప్రజలలో కొత్త ఆశలను రేకెత్తిస్తారు అని అంటున్నారు.
అలాగే చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనలో పోలవరం నిధులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. తొందరలో కేంద్ర కేబినెట్ సమావేశమై పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి సవరించిన అంచనా వ్యయనికి ఆమోదముద్ర వేస్తే ఇక నిధుల వరద పారుతుందని అంటున్నారు. ఆ విషయంలో కూడా ఒక అవగాహన వస్తే బడ్జెట్ లో దానిని కూడా పెట్టి పోలవరం ఎపుడు పూర్తి చేస్తామో కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పనుంది అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే కూటమి బడ్జెట్ కాస్తా లేట్ అయినా లేటెస్ట్ గా అనేక సంచలనాలతోనే ఉంటుందని అంటున్నారు. సెప్టెంబర్ లో బడ్జెట్ సెషన్ కోసం ఇపుడు కూటమి సర్కార్ గట్టి కసరత్తునే చేస్తోంది అని అంటున్నారు.