లక్ష్మీపార్వతికి ఊహించని షాక్... ఇకపై ఆ హోదా లేదు!
అవును... నందమూరి లక్ష్మీపార్వతికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని షాకిచ్చారని తెలుస్తోంది!
By: Tupaki Desk | 2 Aug 2024 6:57 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని కట్టడాలు, అనాలోచిత నిర్ణయాలు, అక్రమాలకు అనువైన ఆలోచనలు అన్నింటికీ చరమగీతం పాడుతున్నట్లు కూటమి పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాబు సర్కార్ లక్ష్మీపార్వతికి షాకిచ్చింది!
అవును... నందమూరి లక్ష్మీపార్వతికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని షాకిచ్చారని తెలుస్తోంది! ఇందులో భాగంగా తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన ఆమెకు గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం “గౌరవ ఆచార్యురాలు” హోదాను ఉపసంహరించుకుంది! ఈ మేరకు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కిశోర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదే సమయంలో.. ఆమెకు ఇప్పటివరకూ యూనివర్శిటీ నుంచి ఎలాంటి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆమె తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా ఉన్న సమయంలో... యూనివర్శిటీలో పీ.హెచ్.డీ. స్టూడెంట్స్ కి గైడ్ గా నియమించారు. అయితే... తాజాగా ఆ విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు!
వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీపార్వతికి.. అదే సమయంలో ఏయూ ప్రొఫెసర్ షిప్ హోదా ఇవ్వడంతోపాటు, పీ.హెచ్.డీ. విద్యార్థులకు గైడ్ గానూ నియమించారు. అయితే.. ఇదంతా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది ఆరోపణగా ఉందని అంటున్నారు.
దీంతో... కూటమి అధికారంలోకి రావడంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు! ఈ నేపథ్యంలోనే... పీ.హెచ్.డీ గైడ్ గా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలని.. ప్రధానంగా ఇలా పీ.హెచ్.డీ చేసే వారికి గైడ్ గా ఉండాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు కనీసం ఐదేళ్ల పాటు ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పిన అనుభవం ఉండాలనే నిబంధన ఉందని చెబుతున్నారు.