Begin typing your search above and press return to search.

నానీలంతా వైసీపీలోనే... టీడీపీకి మంటెక్కిపోద్దా...!?

భలే తమాషాగా ఉంది కదా. రాజకీయాల్లో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. వైసీపీలో నానీలకు కొదవ లేదు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 3:42 AM GMT
నానీలంతా వైసీపీలోనే... టీడీపీకి మంటెక్కిపోద్దా...!?
X

భలే తమాషాగా ఉంది కదా. రాజకీయాల్లో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. వైసీపీలో నానీలకు కొదవ లేదు. ఇప్పటికే ముగ్గురు నానీలు ఉన్నారు. వారే మాజీ మంత్రులు పేర్ని నాని, ఆళ్ళ నాని, కొడాలి నాని. ఈ నానీలకు మరో తోడుగా కేశినేని నాని కూడా వైసీపీలో చేరిపోతున్నారు. నాకు జగన్ నచ్చారు. ఆయన పేదల పక్షపాతి. ఆయనతో కలసి ఇక మీదట నా రాజకీయ ప్రయాణం అంటూ నాని క్లారిటీగా చెప్పేశారు.

దాంతో కేశినేని నాని వైసీపీలోనే అన్నది స్పష్టత వచ్చేసింది. ఇక్కడ మరో ముచ్చట కూడా చెప్పుకోవాలి. ఇందులో ముగ్గురు నానీలు ఒకే జిల్లాకు చెందిన వారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లా రాజకీయం అంతా ఈ నానీల మీదనే ఆధారపడి ముందుకు సాగనుంది అని అంటున్నారు.

ఇంకో విశేషం కూడా ఉంది. ఇందులో ఆళ్ళ నానిని పక్కా పెడితే మిగిలిన ముగ్గురూ ఫైర్ బ్రాండ్లే. వీరు మీడియా ముందుకు వచ్చారంటే అవతల పక్షానికి మాటలే ఉండవు అన్నట్లుగా ఉంటుంది సీన్. కొడాలి నాని పేర్ని నాని వైసీపీ వైపు ఉంటూ టీడీపీని ఇప్పటిదాకా గట్టిగా కార్నర్ చేసేవారు.

ఇపుడు చూస్తే కేశినేని నాని తన మార్క్ చూపిస్తారు అని అంటున్నారు. దానికి ఉదాహరణ అన్నట్లుగా జగన్ ని కలసి వచ్చిన వెంటనే కేశినేని నాని చంద్రబాబు మీద చాలా సంచలన కామెంట్స్ చేశారు. ఏపీకి చంద్రబాబు అసలు పనికిరారు అని పెద్ద బాంబే వేశారు. ఇక చంద్రబాబు కలల రాజధాని అమరావతి అంటూ అచ్చం వైసీపీ బాటలోనే మాటలు మాట్లాడారు.

రియాల్టీకి బాబు దూరమని అందుకే క్రిష్ణా గుంటూరు అభివృద్ధి ఆయనకు పట్టడం లేదని కేశినేని నాని మాటలతో మంటెక్కించారు. చంద్రబాబు విషయంలో ఆ పార్టీలోనే ఈ రోజు దాకా ఉంటూ వచ్చిన కేశినేని నాని వంటి వారు మాట్లాడితే జనాలు కూడా ఆసక్తిగా వింటారు. అందే టైం లో టీడీపీ అమరావతి మన రాజధాని అంటూ ముందుకు వస్తోంది. అయితే అది ఒక కల మాత్రమే రియాలిటీ వేరు అని కేశినేని నాని అంటే కచ్చితంగా దాని ప్రభావం చాలానే ఉంటుంది.

ఇక ఇప్పటికే బాబుని టీడీపీని గట్టిగా విమర్శిస్తున్న కొడాలి నానికి కేశినేని నాని కూడా తోడు అవుతారు అని అంటున్నారు. ఎన్టీయార్ జిల్లాలో అరవై శాతం టీడీపీ ఖాళీ అవడం ఖాయమని కేశినేని నాని పేల్చిన బాంబు ఇపుడు పసుపు శిబిరంలో కలవరం రేపే అంశంగానే ఉంటుంది అని అంటున్నారు.

ఏది ఏమైనా వైసీపీ టీడీపీకి గుండెకాయ లాంటి బెజవాడలో రాజకీయాలను ముగ్గురు నానీ లతో మలుపు తిప్పేస్తోంది అని అంటున్నారు. టీడీపీకి ఇది మంటెక్కించే వ్యవహారమే కాదు రేపటి రోజున బిగ్ ట్రబుల్స్ ని క్రియేట్ చేసేదిగా ఉంటుందని అంటున్నారు.