పుష్ప అరెస్టుతో రేవంత్ సర్కారుకు మైలేజా? డ్యామేజా?
బన్నీ అరెస్టుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. దీనికి తోడు.. అరెస్టు రోజునే జాతీయ మీడియా సంస్థకు చెందిన కార్యక్రమంలో పాల్గొనటం.. ఆ సందర్భంగా బన్నీ అరెస్టు వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
By: Tupaki Desk | 15 Dec 2024 7:56 AM GMTకొన్నిసార్లు అంతే అనుకోనివి.. అంచనాలకు ఏ మాత్రం అందనివి సిం‘ఫుల్’గా జరిగిపోతుంటాయి. ఆ కోవలోకే వస్తుంది సూపర్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళా అభిమాని ప్రాణం పోగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి.. గడిచిన కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇప్పటికి స్ప్రహలోకి రాని పరిస్థితి. అతడి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికి మెరుగు అవుతుందో తెలీని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తొక్కిసలాట కేసులో ఏ11గా ఉన్న హీరో అల్లు అర్జున్ అరెస్టు కావటం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ అల్లు అర్జున్ అరెస్టు అంశం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది. చివరకు కేంద్ర మంత్రులు సైతం అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారాన్ని ఖండించటం ఆసక్తికరంగా మారింది. బన్నీ అరెస్టుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. దీనికి తోడు.. అరెస్టు రోజునే జాతీయ మీడియా సంస్థకు చెందిన కార్యక్రమంలో పాల్గొనటం.. ఆ సందర్భంగా బన్నీ అరెస్టు వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ప్రశ్నలన్నింటికి ముక్తసరిగా సమాధానాలు ఇవ్వకుండా సీఎం రేవంత్ వివరంగా వివరాలు వెల్లడించారు. అంతేకాదు.. తొక్కిసలాటకు అల్లు అర్జున్ ప్రధాన కారణమన్నట్లుగా ఆయన మాటలు సాగాయి. ఇదంతా చూస్తే.. సీఎం రేవంత్ తో అల్లు అర్జున్ అరెస్టు విషయాన్ని పోలీసులు చర్చించిన తర్వాతే.. అరెస్టు వ్యవహారానికి తెర తీసినట్లుగా చెప్పాలి. గుట్టు చప్పుడు కాకుండా అల్లు అర్జున్ ఇంటకి వెళ్లిన పోలీసులు.. అరెస్టు మాటను చెప్పటం ద్వారా అల్లు ఫ్యామిలీకి ఒక్కసారిగా షాకిచ్చిన పరిస్థితి.
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో ఆయన పేరుతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా పెరిగిపోవటమే కాదు.. ఆయన పరపతి అమాంతం ఎక్కువైనట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి వేళలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి ఎలివేషన్ వచ్చింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున చర్చతో పాటు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. ఆయనకు హీరో అల్లు అర్జున్ కు మధ్య ఏమైనా పంచాయితీలు ఉన్నాయి? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. అలాంటిదేమీ లేదన్న మాట పలువురి నోట వినిపించినప్పటికీ.. సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అన్న మాట పలువురి నోట వినిపించింది.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా తొక్కిసలాట కేసులో బన్నీ అరెస్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఇమేజ్ ను పెద్ద ఎత్తున పెంచటమే కాదు ఆయన గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకునే స్థాయికి చేరుకున్నారు. మరి.. ఈ అరెస్టుతో ఆయనకు వచ్చిన ఎలివేషన్ మాత్రం మిక్సెడ్ అన్న మాట బలంగా వినిపిస్తోంది. ఒక స్టార్ హీరోను అరెస్టు చేయటం జైలుకు పంపటం లాంటి అంశాల వేళ.. ఒత్తిళ్లకు ఎదుర్కొన్న వైనం ఇప్పుడు చర్చగా మారింది. అదే సమయంలో ఆయనతో స్నేహంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియాల్సిన వారికి చెప్పకనే చెప్పేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది.