Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కేసు... అధికారులకు ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు!

ఇందులో భాగంగా... పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా..? అని ఆర్జీవీ తన తొలి ప్రశ్నతో అధికారులను ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 2:09 PM GMT
అల్లు అర్జున్  కేసు... అధికారులకు ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు!
X

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ ఎపిసోడ్ లో ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఈ సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో ఆరు గంటల్లో ఎన్నో కీలక పరిణామాలు, సంచలనాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం.. దీంతో.. పోలీసులు బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించడం జరిగిపోయింది.

ఈ సమయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందులో భాగంగా... రు.50,000 ల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరూ చేసింది! ఈ సమయంలో దర్శకుడు ఆర్జీవీ స్పందిస్తూ.. అధికారులకు నాలుగు ప్రశ్నలు సంధించారు.

ఇందులో భాగంగా... పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా..? అని ఆర్జీవీ తన తొలి ప్రశ్నతో అధికారులను ప్రశ్నించారు. ఇదే సమయంలో... ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా..? అంటూ రెండో ప్రశ్న సంధించారు.

ఇదే క్రమంలో.. మూడో ప్రశ్నగా... ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే.. హీరో, హీరోయిన్స్ ని అరెస్ట్ చేస్తారా..? అని ప్రశ్నించిన ఆర్జీవీ.. భద్రతా ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? అంటూ నాలుగో ప్రశ్నను సంధించారు.