Begin typing your search above and press return to search.

'కన్నింగ్ స్టార్' పోస్ట్ వైరల్... వెనుక ఎవరు?

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఎంత చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Dec 2024 5:26 AM GMT
కన్నింగ్ స్టార్ పోస్ట్ వైరల్... వెనుక ఎవరు?
X

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఎంత చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంలో కాంగ్రెస్ లక్ష్యంగా బీఆరెస్స్, బీజేపీలు విరుచుకుపడుతున్నాయి. ఈ విషయంపై రేవంత్ రెడ్డి సర్కార్ ని కూలదోచే కార్యక్రమాలు నడుస్తున్నాయంటూ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చలూ తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.

మరోపక్క అల్లు అర్జున్ అరెస్ట్ పై ఏపీ నుంచి వైసీపీ మాత్రమే స్పందించిన పరిస్థితి. స్వయంగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తూ పోస్ట్ చేయడం గమనార్హం. ఇదే క్రమంలో పలువురు వైసీపీ నేతలు ఈ దిశగా స్పందిస్తూ అల్లు అర్జున్ కు బాసటగా నిలిచారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్న విషయంపై తెరపైకి ఆ సంచలన చర్చ వచ్చింది.

అవును... నిన్న అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు ఉదయం 11 గంటల నుంచి సుమారు మూడున్నర గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీన్ రీకనస్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ కు తీసుకెళ్తారనే చర్చ జరిగినా.. అది కేవలం ప్రచారం మాత్రమే అని తేలింది. ఈ సమయంలో... సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు వైరల్ గా మారాయి.

ఇందులో భాగంగా... "కర్మసిద్ధాంతం" అని "కన్నింగ్ స్టార్" అనే హ్యాష్ ట్యాగ్స్ తో వేలాదిమంది పోస్టులు చేశారు. దీంతో... ఒక్కసారిగా అంతమంది ఈ తరహాలో పోస్టులు పెట్టడం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో.. ఈ వ్యవహారం వెనుక, ఈ క్యాంపెయిన్ వెనుక ఎవరున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

వాస్తవానికి అల్లు అర్జున్ అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ స్పందించాయి. ఇందులో భాగంగా... ప్రభుత్వం, చట్టం తన పని తాను చేసుకుపోతాయంటూ కాంగ్రెస్ నేతలు స్పందించగా... అల్లు అరెస్ట్ కక్ష సాధింపు చర్య అంటూ బీఆరెస్స్, బీజేపీలు వాయిస్ వినిపించాయి. ఆన్ లైన్ లోనూ రేవంత్ లక్ష్యంగా పోస్టులు పెడుతున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... ఏపీలో వైసీపీ ఎలాగూ అల్లు అర్జున్ కు మద్దతుగా నిలవగా.. అధికార టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం ఇంత విషయం జరుగుతున్నా మౌనాన్నే తమ భాషగా చేసుకున్న పరిస్థితి అనే కామెంట్లు వినిపించాయి. మరోపక్క.. గడిచిన ఎన్నికల్లో వైసీపీ నేత తరుపున అల్లు అర్జున్ ప్రచారం చేశారనే విమర్శలు ఆ రెండు పార్టీల సర్కిల్స్ లో నడిచాయని అంటారు.

ఈ నేపథ్యంలో... ఈ స్థాయిలో కర్మసిద్ధాంతం అని, కన్నింగ్ స్టార్ అని టార్గెట్ చేస్తూ పోస్టులు తెరపైకి రావాడం వెనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ల ఫాన్స్ హస్తం ఉందనే చర్చ పెద్ద ఎత్తున మొదలైంది! ఇప్పటికే ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ కు అనుకూలంగా కనిపిస్తున్న పోస్టుల కామెంట్ సెక్షన్స్ లో జనసేన సైనికుల కామెంట్లు చర్చనీయాంశం అవుతున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కన్నింగ్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ పేరు మీద వేలాది పోస్టులు ఒకేసారి హల్ చల్ చేయడం వెనుక ఆ రెండు పార్టీల సానుబూతుపరుల హస్తం ఉందనే చర్చ బలంగా నడుస్తుందని అంటున్నారు.