మరో మూడు రోజులు బన్నీకి టెన్షన్!
దీని ప్రకారం.. ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అదేసమయంలో 14 రోజుల పాటు కోర్టు విధించి న శిక్ష కూడా.. ముగిసింది.
By: Tupaki Desk | 27 Dec 2024 10:20 AM GMTపుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలా ట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరో మూడు రోజులపాటు టెన్షన్ కొనసాగనుంది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై బన్నీ ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ బెయిల్ గడువు కొంత వరకు ఉన్నప్పటికీ.. దీనిని పూర్తిస్థాయిలో రెగ్యులర్ బెయిల్‌గా మార్పు చేయాలన్నది బన్నీ విజ్ఞప్తి.
దీని ప్రకారం.. ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అదేసమయంలో 14 రోజుల పాటు కోర్టు విధించి న శిక్ష కూడా.. ముగిసింది. ఈ రెండు అంశాలపైనా కోర్టు శుక్రవారం విచారించింది. దీనికి సంబంధించి అర్జున్ నేరుగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ, అభిమానుల తాకిడి సహా.. కోర్టు వద్ద ఉన్న రద్దీలను దృష్టిలో పెట్టుకుని బన్నీ వర్చువల్ గానే కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
మధ్యంతర బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని.. సినిమా షూటింగులు, ఇతరత్రా కుటుంబ వ్యవహా రాలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మార్చాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా కోర్టు పోలీసుల ఒపీనియన్ కోరింది. అయితే.. తాము కౌంటర్ వేస్తామని.. కొంత సమయం కావాలని పోలీసులు విన్నవించారు. దీంతో న్యాయమూర్తి ఈ నెల 30 వరకు గడువు ఇచ్చారు. అంటే.. మరో మూడు రోజుల పాటు బన్నీ మధ్యంతర బెయిల్పైనే ఉండనున్నారు.
ఇదిలావుంటే.. సంధ్య ధియేటర్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించి విచారణను కూడా కోర్టు వాయిదా వేసింది. ఇరు పక్షాల అభ్యర్థన మేరకు.. జనవరి 10వ తేదీన పూర్తిస్థాయిలో వాదనలు వింటామని.. అప్పటికల్లా న్యాయవాదులు సిద్ధమై రావాలని కోర్టు సూచించింది. దీంతో ఈ కేసు విచారణ కూడా జనవరి 10వ తేదీకి వాయిదా పడింది.