బిగ్ బ్రేకింగ్... అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్!
అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టగా.. కోర్టు, అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.
By: Tupaki Desk | 13 Dec 2024 10:48 AM GMTప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసి, చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు. తర్వాత అల్లు అర్జున్ వద్ద స్టేట్ మెంట్ తీసుకుని.. అక్కడి నుంచి వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టగా.. కోర్టు, అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.
అవును.. 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకముందు అల్లు అర్జున్ సెంట్రల్ జోన్ ను డీసీపీ ఆధ్వర్యంలో విచారించారు.
మరోవైపు ఈ విషయంపై స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్... "అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది" అని స్పష్టంగా పెర్కొన్న పరిస్థితి. మరోపక్క.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు!
ఈ సమయంలో వైద్య పరీక్ష అనంతరం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరుపు న్యాయవాదులు.. పోలీసుల తరుపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.