ఇంత ఆలస్యంగానా ఈ మాట చెప్పేది బన్నీ?
తన సినిమాకు వచ్చి తీవ్ర గాయాలైన చిన్నారి శ్రీతేజ్ ను ఇప్పటివరకు అల్లు అర్జున్ ఎందుకు పరామర్శించలేదు? అన్నది ప్రశ్నగా మారింది.
By: Tupaki Desk | 16 Dec 2024 5:00 AM GMTఏ విషయానికి ఎంత స్పందించాలి? ఎలా రియాక్టు కావాలన్నది చాలా ము ఖ్యం. వీవీఐపీ అయినా సాదాసీదా వ్యక్తి అయినా.. స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా ఉండే ఎదురయ్యే సమస్యలు అన్నిఇన్ని కావు. అదే సమయంలో.. ఈ అంశంపై అవగాహన ఉన్న వారికి ఎదురే ఉండదు. అత్యున్నత స్థానాల్లో ఉండి కూడా ఈ విషయంలో వ్యవహరించే తీరు ఆధారంగా వారి ఇమేజ్ ఆధారపడి ఉంటుంది.
స్టైలీష్ స్టార్ అలియాస్ పుష్ప.. ఉరఫ్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ఒక భావోద్వేగ అంశం విషయంలో ఆయన స్పందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. తన పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సినిమాను చేసేందుకు వచ్చిన తన వీరాభిమాని అయిన శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటం.. ఇప్పటికి స్ప్రహలోకి రాకపోవటం తెలిసిందే. ఇప్పటికే శ్రీతేజ్ తల్లి మరణించగా.. ఇతడు మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తన బెనిఫిట్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు సైతం బాధ్యత ఉందంటూ.. చిక్కడపల్లి పోలీసులు తొక్కిసలాట ఉందంలో బన్నీని ఏ11గా చూపించటం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికేఅరెస్టు అయి.. రిమాండ్ కు వెళ్లి.. రోజు వ్యవధిలో తిరిగి వచ్చేయటం ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ క్రమంలో జైలు నుంచి వచ్చిన అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అతడింటికి వెళ్లారు.
దీనిపై సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు అంతలా ప్రముఖులు వస్తున్నారు.. తన సినిమాకు వచ్చి తీవ్ర గాయాలైన చిన్నారి శ్రీతేజ్ ను ఇప్పటివరకు అల్లు అర్జున్ ఎందుకు పరామర్శించలేదు? అన్నది ప్రశ్నగా మారింది. దీనిపై తాజాగా అల్లు అర్జున్ స్పందించారు. కేసు విచారణ కొనసాగుతున్న కారణంగా శ్రీతేజ్ ను కలవలేకపోతున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నారు.
సంధ్య థియేటర్ వద్ద తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను తాను కలవాలనుకుంటున్నట్లుగా అల్లు అర్జున్ పేర్కొంటూ.. ‘‘బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నా. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా’’ అంటూ పేర్కొన్నారు.
అయితే.. ఈ విషాద ఘటన జరిగిన తర్వాతి రోజే బన్నీ వెళ్లాల్సి ఉందని.. ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదు? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పుడైతే కేసు ఉంది. కానీ.. ఘటన జరిగిన తర్వాతి రోజు ఉదయమే ఆసుపత్రికి వెళ్లి.. తనను అమితంగా ఆరాధించే చిన్నారి కదల్లేని స్థితిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతునన వైనం వార్తల రూపంలో పెద్ద ఎత్తున టెలికాస్ట్ అయినా అల్లు అర్జున్ అప్పట్లో రియాక్టు కాలేదు. ఇప్పటిలా ఒక ప్రకటనను విడుదల చేయలేదు. ఇప్పుడు ఈ ఎసిసోడ లో ఎన్నో జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ప్రకటన విడుదల చేయటాన్ని తప్పు పడుతున్నారు. అల్లు అర్జున్ ను పుష్పరాజ్ తో పోలిక పెడుతూ.. పుష్పావి అయి ఉండి ఇంంత లేట్ కావటమేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజమే.. ఆ మాటలోనూ అంతో ఇంతో న్యాయం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.