పోలీసుల విషయంలో అల్లు అర్జున్ టీమ్ కీలక నిర్ణయం!!?
ఈ సమయంలో అల్లు అర్జున్ కు అండర్ ట్రైల్ ఖైదీగా అధికారులు "ఖైదీ నెంబర్ 7697" ను కేటాయించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ రాత్రంతా జైలులో నేలపైనే పడుకున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 14 Dec 2024 6:29 PM GMTఅల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత గంట గంటకీ పరిణామాలు తీవ్రంగా మారిపోయాయి. ఈ సమయంలో సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
ఈ సమయంలో తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... హైకోర్టులో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. మధ్యంతర బెయిల్ ఇచ్చారు. దీంతో.. అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు రిసెప్షన్ లో వెయిట్ చేశారనే చర్చ తెరపైకి వచ్చింది.
అయితే... శుక్రవారం రాత్రి 10 గంటలు అయినా అల్లు అర్జున్ బయటకు విడుదల కాలేదు. దీంతో.. ఏమి జరిగిందనే చర్చ తీవ్రంగా నడిచింది. అయితే... పోలీస్ డిపార్ట్ మెంట్ పేపర్ వర్క్స్ లో జాప్యం కారణంగా అల్లు అర్జున్ శుక్రవారం రాత్రంతా చంచల్ గూడ జైలులోనే మంజీరా బ్యారక్ లో గడపాల్సి వచ్చిందని తెలుస్తోంది!
ఈ సమయంలో అల్లు అర్జున్ కు అండర్ ట్రైల్ ఖైదీగా అధికారులు "ఖైదీ నెంబర్ 7697" ను కేటాయించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ రాత్రంతా జైలులో నేలపైనే పడుకున్నారని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని అల్లు అర్జున్ లీగల్ టీమ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది! ఇందులో భాగంగా పోలీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోందని అంటున్నారు.
అవును... అల్లు అర్జున్ కు శుక్రవారం సాయంత్రనికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. శుక్రవారం రాత్రంతా జైలులోనే గడపాల్సి రావడాన్ని ఆయన తరుపు లీగల్ టీమ్ తీవ్రంగా పరిగణిస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా.. పోలీసులపై అల్లు అర్జున్ తరుపు న్యాయవాదులు కోర్టు దిక్కారం కేసు నమోదు చేయనున్నారని అంటున్నారు.
ఇదంతా పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని.. ఉద్దేశ్యపూర్వకంగానే బెయిల్ ఉత్తర్వ్యుల విషయంలో ఆలస్యంగా స్పందించారనే చర్చ నడుస్తుంది. దీంతో.. ఈ వ్యవహారం ఎలాంటి సంచలనాలకు దారి తీయబోతోందనేది వేచి చూడాలి!