అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రేవంత్, సీపీ ఆనంద్ రియాక్షన్స్ ఇవే!
ఓ పక్క దేశవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్లలో పుష్ప-2 వీరంగం సృష్టిస్తుండగా.. మరోపక్క ఆ సినిమాలోని కథానాయకుడు అరెస్ట్ అనే అంశం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 13 Dec 2024 9:50 AM GMTఅల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారిందని అంటున్నారు. ఓ పక్క దేశవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్లలో పుష్ప-2 వీరంగం సృష్టిస్తుండగా.. మరోపక్క ఆ సినిమాలోని కథానాయకుడు అరెస్ట్ అనే అంశం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరోపక్క ఈ అరెస్ట్ పై తెలంగాణ సీఎం, హైదరాబాద్ సీపీ స్పందించారు.
అవును.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. ఇందులో భాగంగా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిక్కడపల్లి సంధ్య థియేటర్ లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశాం.. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది.. అల్లు అర్జున్ ను గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు.. అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు!
అనంతరం ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... చట్టం తనపని తాను చేసుకుపోతుందని.. ఇందులో తన జోక్యం ఏమీ లేదని.. చట్టం ముందు అందరూ సమానులే అని.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు!!
మరోవైపు అల్లు అర్జున్ కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. అల్లు అర్జున్ రిమాండ్ కు పోలీసులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారని అంటున్నారు