Begin typing your search above and press return to search.

అల్లుఅర్జున్ పొలిటిక‌ల్ ఎఫెక్ట్‌.. వాళ్ల‌పై వేటు

తాజాగా అల్లుఅర్జున్ ర్యాలీ ఘ‌ట‌నలో ఎఫెక్ట్‌తో ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌పై వేటు ప‌డింది. ర్యాలీ స‌మాచారం ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో కానిస్టేబుళ్లు నాయ‌క్‌, నాగ‌రాజుల‌ను ఎస్పీ వీఆర్‌కు అటాచ్ చేశారు.

By:  Tupaki Desk   |   25 May 2024 8:24 AM GMT
అల్లుఅర్జున్ పొలిటిక‌ల్ ఎఫెక్ట్‌.. వాళ్ల‌పై వేటు
X

లేక‌లేక వైసీపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా ఆయ‌న ఇంటికి వెళ్ల‌డం అల్లుఅర్జున్‌కు తీవ్ర‌మైన చేటు చేసింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే మెగా అభిమానుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న కార‌ణంగా ఇప్పుడు ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌పై వేటు ప‌డింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నంద్యాల‌లో వైసీపీ అభ్య‌ర్థి శిల్పార‌వికి మ‌ద్ద‌తుగా అల్లుఅర్జున్ ఆయ‌న ఇంటికి వెళ్లారు. అంతే కాకుండా ప్ర‌చారంలో భాగంగా ర్యాలీ కూడా నిర్వ‌హించారు. కానీ ఈ ర్యాలీకి ముంద‌స్తు అనుమ‌తి లేదు. దీంతో ఆగ్ర‌హించిన ఎన్నిక‌ల సంఘం అల్లుఅర్జున్‌, శిల్పార‌విపై కేసు న‌మోదు చేసింది. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతోంది.

తాజాగా అల్లుఅర్జున్ ర్యాలీ ఘ‌ట‌నలో ఎఫెక్ట్‌తో ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌పై వేటు ప‌డింది. ర్యాలీ స‌మాచారం ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో కానిస్టేబుళ్లు నాయ‌క్‌, నాగ‌రాజుల‌ను ఎస్పీ వీఆర్‌కు అటాచ్ చేశారు. ఈ విచార‌ణ ఇంకా కొన‌సాగుతుండ‌టంతో మ‌రికొంద‌రు అధికారుల‌పై ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సోష‌ల్‌మీడియా వేదిక‌గా స‌పోర్ట్ ప్ర‌క‌టించిన అల్లుఅర్జున్ ఆ వెంట‌నే వైసీపీ నాయ‌కుడు శిల్పార‌వి కోసం నంద్యాల వెళ్ల‌డం అప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నెల 11న ఆయ‌న నంద్యాల వెళ్లారు. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, మెగా అభిమానులు అల్లుఅర్జున్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌ద్ద‌తు ఉంటుంద‌ని మాట‌ల్లో చెప్ప‌డం కాద‌ని చేత‌ల్లో చూపించాల‌ని అల్లుఅర్జున్‌ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ గెలుపు కోసం సాయిధ‌ర‌మ్‌తేజ్‌, వ‌రుణ్ తేజ్‌, రామ్‌చ‌ర‌ణ్ త‌దిత‌రు హీరోలు పిఠాపురం వెళ్లిన సంగ‌తి తెలిసిందే.