Begin typing your search above and press return to search.

Ind vs Pak : అంబటి రాయుడు కామెంట్స్‌పై వివాదం: అసలు ఏమైంది?

అయితే ఈ మ్యాచ్ లో కామెంట్రీ చేస్తోన్న అంబటి రాయుడు తాజాగా చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి తెరతీశాయి.

By:  Tupaki Desk   |   24 Feb 2025 4:54 AM GMT
Ind vs Pak : అంబటి రాయుడు కామెంట్స్‌పై వివాదం: అసలు ఏమైంది?
X

భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆటగాళ్ల పోటీ మాత్రమే కాదు.. అభిమానులకు ఒక గొప్ప అనుభవం కూడా. ప్రతిసారీ ఈ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా జరిగిన భారత్ - పాక్ మ్యాచ్‌ కు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్ లో కామెంట్రీ చేస్తోన్న అంబటి రాయుడు తాజాగా చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి తెరతీశాయి.

- ఎవరిని ఉద్దేశించి రాయుడు వ్యాఖ్యలు చేశాడు?

ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు సినిమా, క్రీడా, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున దుబాయ్ వెళ్లారు. వీరిలో తెలుగు ప్రముఖులు కూడా ఉన్నారు. మ్యాచ్ జరుగుతుండగా స్క్రీన్‌పై కొంతమంది ప్రముఖులు కనిపించారు. అప్పుడు కామెంటేటర్ ఒకరు "ప్రైడ్ ఆఫ్ తెలుగు" అని వ్యాఖ్యానించారు. దీనిపై అంబటి రాయుడు స్పందిస్తూ "ఇలాంటి మ్యాచ్లు అయితే టీవీల్లో ఎక్కువ కనిపిస్తారు. పబ్లిసిటీ స్టంట్" అని అన్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడన్న విషయంపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

- సోషల్ మీడియాలో ట్రోల్స్, మద్దతు

రాయుడు వ్యాఖ్యలు కొన్ని సెలబ్రిటీలను ఉద్దేశించినవి అనుకుంటూ కొందరు అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం రాయుడు మాటలను సమర్థిస్తున్నారు. ఆయన ఎవరి గురించి మాట్లాడారని స్పష్టత లేకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు సినిమా హీరోలపై, మరికొందరు దర్శకులపై కామెంట్స్ చేస్తున్నారు.

- రాయుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం?

ప్రస్తుతం రాయుడు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ వివాదం ఇంకా కొనసాగుతుండటంతో ఆయన ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాయుడు తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తే ఈ గందరగోళం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు అందరికీ అర్థం కాని ఈ కామెంట్ వివాదాస్పదంగా మారి, రాయుడు మరింత టార్గెట్ గా మారుతున్నారు..

అంబటి రాయుడు కామెంట్స్ ఒక చిన్న వ్యాఖ్యగానే చేసుకున్నా, అది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొందరు సెలబ్రిటీల అభిమానులు రాయుడిని తప్పుబడుతుండగా, మరికొందరు అతడిని సమర్థిస్తున్నారు. అంబటి రాయుడు అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? మ్యచ్ చూడడానికి వచ్చిన జనాలనా? మ్యాచ్ చూడడానికి వచ్చినా సెలబ్రెటీలనా? అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే రాయుడు చేసిన కామెంట్స్ కు కొందరు ఆపాదించుకుంటూ అవి ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడని రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. ఆ హీరోను , ఈ డైరెక్టర్ ను అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే రాయుడు మాత్రం ఏ ఒక్క సెలబ్రెటీ పేరు కానీ.. జనాల పేరు కానీ ప్రస్తావించకుండానే మాట్లాడారు. ఈ వివాదం మరింత ముదరకముందే రాయుడు స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.