Begin typing your search above and press return to search.

మరో వీడియో వదిలిన అంబటి రాంబాబు అల్లుడు..!

దీంతో... ఆ వీడియోపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు... విలేకర్ల సమావేశం నిర్వహించి తన చిన్నల్లుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

By:  Tupaki Desk   |   7 May 2024 11:18 AM GMT
మరో వీడియో వదిలిన అంబటి రాంబాబు అల్లుడు..!
X

సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు - ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మొదలైన మాటల యుద్ధం రోజు రోజుకీ హీటెక్కుతుంది. ఇప్పటికే ఒక వీడియో విడుదల చేయడం.. దానికి అంబటి రాంబాబు వివరణ ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో గౌతమ్ మరో వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి చివరి రోజుల్లో అంబటి రాంబాబు చేసిన పని ఇదంటూ వివరించారు.

అవును... అంబటి రాంబాబుపై ఆయన చిన్నల్లుడు గౌతమ్ సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "మా మామయ్య నీచుడు, ఆయనకు ఒటు వేయకండి" అంటూ గౌతమ్ ఇటీవల విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

దీంతో... ఆ వీడియోపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు... విలేకర్ల సమావేశం నిర్వహించి తన చిన్నల్లుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇదే సమయంలో... గత నాలుగేళ్ల నుంచి తన కూతురు, మనవడు, మనవరాళ్లు తనవద్దే ఉన్నారని తెలిపారు. ఇదే సమయంలో వారి అవసరాలు తానే చూస్తున్నానని, భార్యాపిల్లలను చూసుకోని దుర్మార్గుడు గౌతమ్ అంటూ ఆరోపించారు.

పైగా ఎన్నికల సమయంలో గౌతమ్ వీడియో విడుదల చేయడం వల్లో ఏమో కానీ... ఈ వ్యవహారం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అంబటి చిన్నల్లుడు మరో వీడియో వదిలారు. ఈ సందర్భంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తన తండ్రి ఐసీయూలో ఉన్నప్పుడు మనవడిని మనవారలిని చూడాలని ఉందని ఎన్నో మెసేజ్ లు పెట్టినట్లు చెప్పిన గౌతమ్... తన తండ్రి మార్చి 22న చనిపోయారని.. చివరి దశలో ఉన్న తన తండ్రి.. తన మనవణ్ని, మనవరాలిని చూసుకోలేదని.. మీ కుటుంబాన్ని ప్రశ్నిస్తే ఎంత దుర్మార్గమైనా చేస్తారా.? నేను, తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని కొడుకుగా మిగిలిపోయా. చివరకు విసిగెత్తి కోర్టుకు వెళ్లా" అని గౌతమ్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో... "ఇప్పటికీ చెప్తున్నా.. నా కొడుకును, నా కూతురుని మీరు పోషించాల్సిన పనిలేదు. మీరు రూపాయి పెట్టాల్సిన పనిలేదు. రేపు మీడియా సాక్షిగా నేను వచ్చి తీసుకెళ్తాను.. మీరు ఓకే చెప్పండి. నేను పోషించుకుంటా" అంటూ గౌతమ్ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు.