అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి... తెరపైకి బిగ్ ట్విస్ట్!
ప్రస్తుతం కొన్ని కీలక లోక్ సభ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఎవరనే విషయంపై ఆల్ మోస్ట్ అన్ని పార్టీల్లోనూ కీలక చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 6 March 2024 10:15 AM GMTప్రస్తుతం కొన్ని కీలక లోక్ సభ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఎవరనే విషయంపై ఆల్ మోస్ట్ అన్ని పార్టీల్లోనూ కీలక చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఎంపీ అభ్యర్థి ఎవరనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మిథున్ రెడ్డి ఈ విషయంపై స్పందించిన తీరు ఆసక్తిగా మారింది.
అవును... ప్రస్తుతం అమలాపురం సిట్టింగ్ ఎంపీగా చింతా అనురాధ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇన్ ఛార్జ్ లను మారుస్తున్న జాబితాలో అనురాధ పేరు కూడా తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. దీంతో... ఈసారి అమలాపురం ఎంపీ అభ్యర్థిని మార్చాలని జగన్ నిర్ణయించారని సమాచారం. దీంతో ఆమె తాలూకు ప్రచారాలు ఏమీ కనిపించడం లేదు!
మొన్నటివరకూ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ను ఈదఫా అమలాపురం ఎంపీగా పోటీచేయాలని సూచించారని.. అయితే అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని కథనాలొచ్చాయి! ఈ నేపథ్యంలో అమలాపురంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరనే విషయం చర్చకు వచ్చింది. ఈ సమయంలో రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించారని ఆయనే వెల్లడించారు!
అయితే.. రాపాక ఎంపీగా వెళ్లిపోతే రాజోలుకు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయంలో కీలక చర్చలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరిపోయారు. దీంతో... ఈ సారి గొల్లపల్లికి రాజోలు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే గెలుపు పక్కా అని అంటున్నారు కాబట్టి.. రాపాకను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పంపుతారనే చర్చ సైతం నియోజకవర్గంలో బలంగా నడుస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం గోదావరి జిల్లాల సమన్వయ కర్తగా ఉన్న మిథున్ రెడ్డి... అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరనే విషయం అధిష్టాణం ఫైనల్ చేస్తుందని వివరించారు. ఈ సమయంలో వేదికపై చింతా అనురాధ కూడా ఉండటం గమనార్హం. దీంతో... అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంట ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఈ విషయంపై ఎప్పటికి క్లారిటీ వచ్చేదీ వేచి చూడాలి!