ఆమంచి బ్రదర్స్ జనసేనలోకి ?
ఇక 2019లో వైసీపీ తరఫున పోటీ చేసినా టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం చేతిలో పరాజయం పాలు అయ్యారు.
By: Tupaki Desk | 9 Dec 2024 4:01 AM GMTఆమంచి బ్రదర్స్ ఒంగోలు జిల్లాలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ రాజకీయంగా ధీటు అయిన నేతగా పేరు తెచ్చుకున్నారు. చీరాలలో ఆయన బలం బలగం గట్టిగానే ఉన్నాయి. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన 2014లో ఇండిపెండెంట్ గా మరోసారి గెలిచి రికార్డు సృష్టించారు.
ఇక 2019లో వైసీపీ తరఫున పోటీ చేసినా టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం చేతిలో పరాజయం పాలు అయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో కరణం బలరాం వైసీపీలో చేరారు. దాంతో ఆమంచికి కష్టాలు మొదలయ్యాయి. ఆయనను పర్చూరు ఇంచార్జిగా వైసీపీ నియమించినా ఆయన ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై కొట్టేసి కాంగ్రెస్ లో చేరిపోయారు.
ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే 40 వేల ఓట్లు తెచ్చుకున్నారు. దాంతో తనకు ఉన్న బలం ఏంటో ఆయన మళ్లీ నిరూపించారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన మరోసారి పార్టీ మారే యోచనలో ఉన్నారని అంటున్నారు. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరినా టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సైలెంట్ అయ్యారు.
ఇపుడు ఆమంచి బ్రదర్స్ ఇద్ద్దరూ జనసేనలో చేరేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. చీరాలలో ఉన్న సామాజిక వర్గ సమీకరణలు జనసేనకు ఏపీలో అంతకంతకు పెరుగుతున్న ఆదరణ వంటివి దృష్టిలో పెట్టుకుని వారు ఈ నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలన్నది ఆమంచి బ్రదర్స్ ఆకాంక్షగా చెబుతున్నారు.
ఏపీలో నానాటికీ జనసేన విస్తరిస్తోంది. దాంతో ఆ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని ఆమంచి క్రిష్ణ మోహన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతానికి తన సొంత బిజినెస్ లు చూసుకుంటున్న ఆమంచి రాజకీయంగా కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో రాజకీయంగా మారుతున్న సమీకరణలను కూడా గమనంలోకి తీసుకుని ఈసారి కరెక్ట్ స్టెప్ తీసుకోవాలనే ఆమంచి బ్రదర్స్ ఉన్నారని అంటున్నారు. ఆమంచి బ్రదర్స్ రాజకీయం కనుక జనసేన వైపుగా సాగితే అది ఒంగోలు జిల్లాలో ఆ పార్టీ మరింతగా బలోపేతం అవడానికి చాన్స్ ఉంటుందని అంటున్నారు.
ఇక రానున్న ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తీసుకోవాలని పొత్తులలో అయినా కూడా సత్తా చాటాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు. దాంతో ఆ పార్టీలో కొత్త నాయకులు కూడా చాలా మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇక జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేన బలపడేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. ఆయనకు జిల్లా మొత్తం మీద ఉన్న పట్టుతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమంచి బ్రదర్స్ జనసేనలో చేరాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. కొత్త ఏడాదిలో సరికొత్త దిశగా ఆమంచి బ్రదర్స్ పొలిటికల్ స్టెప్స్ ఉంటాయని అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి మరి.