Begin typing your search above and press return to search.

వాయిదా : అటు పెళ్లి .. ఇటు మ్యాచ్!

ఎంతో ఉత్సాహంగా వచ్చిన అతని ఆశల మీద వరుణుడు నీళ్లు చల్లాడు.

By:  Tupaki Desk   |   20 May 2024 11:30 PM GMT
వాయిదా : అటు పెళ్లి .. ఇటు మ్యాచ్!
X

ఆటగాళ్లంటే అభిమానం ఉండాలి. ఆటలంటే అభిమానం ఉండాలి. కానీ అది పిచ్చిగా మారొద్దు. తన అభిమాన జట్టు క్రికెట్ మ్యాచ్ ఉందని అతడు ఏకంగా పెళ్లిని వాయిదా వేసుకుని పోలోమంటూ స్టేడియానికి వచ్చేశాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు. ఎంతో ఉత్సాహంగా వచ్చిన అతని ఆశల మీద వరుణుడు నీళ్లు చల్లాడు.

త్రిపురకు చెందిన ఓ వ్యక్తికి వివాహం కుదిరింది. అతడి పెళ్లి ఆదివారం(మే 19)న జరగాల్సి ఉంది. అయితే అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు అతడు వీరాభిమాని. ఈ నేపథ్యంలో మే 19న కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గువహటిలోని బార్సపరా స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కోసం వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. అసోంలోని గువాహటిలోని బార్సపరా స్టేడియానికి పెళ్లి దుస్తులతో వచ్చాడు. స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన వారు విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే పెళ్లిని వాయిదా వేసుకుని మరీ కేకేఆర్, ఆర్ ఆర్ మధ్య జరిగే మ్యాచ్ను చూసేందుకు వెళ్లిన వ్యక్తికి వరుణుడు షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐపీఎల్-17 లీగ్ దశ చివరి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. దీంతో అతడు నిరాశగా వెనుదిరిగాడు.