Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... ఆ ఎంపీ కం హీరోయిన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

దీంతో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవనీత్ కౌర్ కి ఇది అతిపెద్ద రిలీఫ్ అని అంటున్నారు!

By:  Tupaki Desk   |   4 April 2024 9:49 AM GMT
బిగ్  బ్రేకింగ్... ఆ ఎంపీ కం హీరోయిన్  కు సుప్రీంకోర్టులో భారీ ఊరట!
X

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభిందింది. ఈ కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును గురువారం నాడు సర్వోన్నత న్యాయస్థానం రద్దుచేసింది. ఈ మేరకు జస్టీస్ జేకే మహేశ్వరి, జస్టీస్ సంజయ్ కౌల్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. దీంతో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవనీత్ కౌర్ కి ఇది అతిపెద్ద రిలీఫ్ అని అంటున్నారు!

వివరాళ్లోకి వెళ్తే... 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నవనీత్ కౌర్, ఆ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 2019 లోక్ సభ ఎన్నికల్లో అమరావతి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఈ సమయంలో... నవనీత్ కౌర్ ఎస్సీ కాదని, ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని ఆరోపిస్తూ ఆమె ప్రత్యర్థి ఎంపీ, శివసేన నేత ఆనందరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో... ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం 2021 జూన్ లో తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా... ఆమె ఎన్నికల్లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు నిర్దారిస్తూ... రూ. 2 లక్షల జరిమానా విధించింది. .దీంతో... ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు నవనీత్ కౌర్. ఈ క్రమంలో దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజాగా తీర్పు వెలువరించింది.

ఇందులో భాగంగా... స్క్రూటినీ కమిటీ తన ముందున్న పత్రాలను సక్రమంగా పరిశీలించిందని.. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా తన నిర్ణయాన్ని ఆమోదించిందని.. ఇది ఆర్టికల్ 226 ప్రకారం ఎలాంటి జోక్యానికీ అర్హమైంది కాదని చెబుతూ... హైకోర్టు ఆర్డర్ పక్కన పెడుతున్నట్లు పేర్కొంది!! దీంతో... లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవనీత్ కౌర్ కి బిగ్ రిలీఫ్ దొరికినట్లయ్యింది!

కాగా... నవనీత్ కౌర్ ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ టిక్కెట్ పై మరోసారి అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు! ఇక, గత ఎన్నికల్లో 5,10,947 ఓట్లు సాధించిన నవనీత్ కౌర్... 36,951 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.