Begin typing your search above and press return to search.

నీ అత్తారింటికి దారేది ప‌వ‌న్‌: ఏపీ మంత్రి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఏపీకి చెందిన మంత్రి, ఫైర్ బ్రాండ్ గుడివాడ అమ‌ర్నాథ్ తీవ్ర‌స్థాయి లో ఫైర‌య్యారు. అదేస‌మ‌యంలో వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 9:49 AM GMT
నీ అత్తారింటికి దారేది ప‌వ‌న్‌:  ఏపీ మంత్రి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఏపీకి చెందిన మంత్రి, ఫైర్ బ్రాండ్ గుడివాడ అమ‌ర్నాథ్ తీవ్ర‌స్థాయి లో ఫైర‌య్యారు. అదేస‌మ‌యంలో వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. "ప‌వ‌న్ నీ అత్తారింటికి దారేదీ?" అని ప్ర‌శ్నించారు. ఏపీలో జ‌న‌సేన‌కు మ‌ళ్లీ డిపాజిట్లు కూడా రావ‌ని అన్నారు. తెలంగాణలో వ‌చ్చిన ఫ‌లిత‌మే.. ఏపీలో జనసేనకు వ‌చ్చి తీరుతుంద‌ని మంత్రి చెప్పారు.

"ప‌వ‌న్ గారూ.. మీ స్థిర నివాసం హైదరాబాద్.. తెలంగాణలో మీ బలం చూసాం.. డిపాజిట్లు కూడా రాలేదు. ఆంధ్రాకు మీకు అసలు సంబంధం ఏంటి? మీరు గత తొమ్మిదేళ్లుగా ఏపీలో ఎన్ని రోజులున్నారు" అని గుడివాడ ప్ర‌శ్నించారు. అంతేకాదు.. జ‌న‌సేనాని అని పిల‌వ‌డ‌మే నాయ‌కుడి నియోజకవర్గం చెప్పండి? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాజువాకా? భీమవరమా? ఏది మీ నియోజ‌క‌వ‌ర్గం? అని ప్ర‌శ్నించారు.

ప‌వ‌న్‌.. నాన్ రెసిడెంట్ ఆంధ్రా. పవన్‌ను ఆదరించే నియోజకవర్గ లేదు. పవన్ కళ్యాణ్‌కు అబ్రహం లింక‌న్‌ స్ఫూర్తి కాదు. 'నారా లింకన్' స్పూర్తి. తెలంగాణలో బీజేపీని నాశనం చేసావ్.. ఇక్కడ ఏం చేస్తావో చూస్తాం అని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేశామని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా? నువ్వు ఎప్పుడైనా చెప్పావా? అని ప‌వ‌న్ను ప్ర‌శ్నించారు. విశాఖ‌కు రాజధాని వచ్చి, బిల్డింగ్ నిర్మాణం చేస్తుంటే ఎందుకు అడ్డుకున్నార‌ని నిల‌దీశారు.

నాదెండ్ల క‌ట్ట‌ప్ప‌!

"ఒకే దెబ్బకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు పిట్టలు పడిపోయి. పవన్ కళ్యాణ్ పక్కన నాదెండ్ల మనోహర్ అనే 'కట్టప్ప' ఉన్నాడు. విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కాదు. సాటిలైట్ సెంటర్ నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. అత్తారింటికి దారేది.. రాజధానికి దారేది అంటున్నాడు. అత్తారింటికి దారేది అంటే నేను చిట్టివలస అని చెప్తున్నా. ఆయన ఏం చెప్తాడో! చెప్పమనండి" అని గుడివాడ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.