Begin typing your search above and press return to search.

జగన్ని ఆపే శక్తి పొలిటికల్ టూరిస్టులకు లేదు...!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శక్తి ఏంటో పొలిటికల్ టూరిస్టులకు తెలియదు అని వారు ఆయన జోరుకి ఎక్కడ బ్రేక్ వేయలేరని వైసీపీ యువ మంత్రి గుడివాడ అమరనాధ్ హాట్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 3:15 AM GMT
జగన్ని ఆపే శక్తి పొలిటికల్ టూరిస్టులకు లేదు...!
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శక్తి ఏంటో పొలిటికల్ టూరిస్టులకు తెలియదు అని వారు ఆయన జోరుకి ఎక్కడ బ్రేక్ వేయలేరని వైసీపీ యువ మంత్రి గుడివాడ అమరనాధ్ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖను రాజధానిగా చేద్దామంటే ఎందుకు అంత కలవరం అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. విశాఖ కేంద్రంగా పాలనకు ప్రజా మద్దతు ఉందని మంత్రి అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా మార్చడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని స్పష్టం చేశారు.

అసలు అధికార వికేంద్రీకరణను పొలిటికల్ టూరిస్టులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని గుడివాడ నిలదీశారు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లకు ఏపీతో ఏమి పని అన్నారు. వారంతా హైదరాబాద్ లో ఉంటూ ఏపీకి పొలిటికల్ టూరిస్టుల మాదిరిగా వస్తున్నారని గుడివాడ విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఈ పొలిటికల్ టూరిస్టులు వ్యతిరేకిచడం దారుణం అన్నారు.

కేవలం అమరావతిలో వారి ఆస్తుల విలువలు తగ్గిపోతాయన్నదే వాళ్ళ భయమని మంత్రి అంటున్నారు. నిజనికి గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మారిస్తే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రను ప్రగతి దిశగా నడిపిస్తున్నారని గుడివాడ చెప్పుకొచ్చారు. విశాఖ నుంచి పాలన సాగించేందుకు వీలుగా కార్యాలయాలను తరలిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన అంటున్నారు.

ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గుడివాడ అన్నారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తదితర పొలిటికల్ టూరిస్టులు ఎందుకు భయపడుతున్నారని, ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు ఎందుకు రాయిస్తున్నారని మంత్రి ప్రశ్నించారు.

ఏపీలో చంద్రబాబు ఎపుడూ ఉన్నది లేదని. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 రోజులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లో ఆయన అన్ని రోజులు ఉండటం అదే ప్రధమమని అన్నారు. అంతే కాదు 2014- 19 సమయంలో ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాదులోనే ఎక్కువ కాలం గడిపారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తికి ఆంధ్ర ప్రజలపై అభిమానం రాష్ట్ర అభివృద్ధిపై మమకారం ఎలా ఉంటుందని అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు.

కేవలం పొలిటికల్ టూరిస్ట్ గా ఆంధ్ర ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోతున్న చంద్రబాబు లొకేష్ పవన్ లకు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టే అర్హత లేదని ఆయన అన్నారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి ఆ ప్రాంత ప్రజలను నమ్మించి మోసం చేసి, ఇప్పుడు అక్కడి నుంచే పాలన సాగించాలని కోరుకుంటున్నారు తప్ప రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి ఏ కోశానా ఆలోచన చేయటం లేదని అమర్నాథ్ విమర్శించారు.

ఇదిలా ఉండగా విశాఖకు పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్ర భవిష్యత్తు బంగారం అవుతుందని, హైదరాబాద్ తర్వాత అత్యంత శక్తివంతమైన నగరాలలో ఒకటిగా విశాఖ నిలిచి రాష్ట్రానికి దిక్సూచిగా నిలబడుతుందని మంత్రి అంటున్నారు. విశాఖ అభివృద్ధి అయితే రాష్ట్రం నలువైపులా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

విశాఖకు రాజధాని తరలిస్తామన్నప్పుడల్లా విపక్షాలు ఏదోరకంగా బురద జల్లుతున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి తరలించడం లేదు కదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం విజయవాడ నుంచి పాలన విశాఖపట్నం వస్తే తప్పేంటని అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖ నుంచి పాలన సాగించాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు ప్రశ్నించే హక్కు అంతకన్నా లేదని అంటున్నారు. జగన్ స్పీడ్ కి బ్రేకులు వేసే సత్తా విపక్షానికి ఏ మాత్రం లేదని అన్నారు.