ఏపీలో ప్రగతి వెలుగులు....జీఎస్టీలో అద్భుత వసూళ్లు
ఏపీలో ఏమీ జరగడంలేదు అంటూ జరుగుతున్న ప్రచారానికి సరైన జవాబు అన్నట్లుగా ఏకంగా కేంద్రమే ఏపీ ప్రగతి దారులు ఏమిటో స్పష్టంగా చెప్పేసింది.
By: Tupaki Desk | 17 Nov 2023 4:18 PM GMTఆంధ్రప్రదేశ్ లో పాలన గురించి బయట వారు చెబితేనే అర్ధం చేసుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అయితే లేదు. మంచిని మంచిగా చూసి చెప్పే విశాలత్వం రాజకీయాల్లో కనిపించడంలేదు. ఏపీలో ఏమీ జరగడంలేదు అంటూ జరుగుతున్న ప్రచారానికి సరైన జవాబు అన్నట్లుగా ఏకంగా కేంద్రమే ఏపీ ప్రగతి దారులు ఏమిటో స్పష్టంగా చెప్పేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అగ్రగామిగా మారింది అంటూ కేంద్రమే ప్రకటించడం విశేషం. ఏపీ ఉత్పత్తి, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది అని నివేదికలు గణాంకాలు ఎప్పటికపుడు తెలియచేస్తున్నాయి. ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్ళలో 12 శాతం వృద్ధి నమోదైందని కేంద్రం తాజాగా వివరించింది. అలాగే ఈ ఏడాది అంటే 2023 ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య 5 వేల 19 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా పేర్కొనడం నిజంగా శుభ పరిణామంగా పేర్కొంటున్నారు.
ఈ విషయాన్నికి ఎవరో చెప్పడం కాదు, సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారాం ఈ అంశాన్ని వెల్లడించారు. ఏపీ వివిధ రంగాలలో ప్రగతి సాధించింది అన్నది కూడా గణాంకాల ద్వారా రుజువు అయింది. ఏపీలో వివిధ రంగాల అభివృద్ధిని చూసినట్లు అయితే వాహన రంగంతో పాటు, సిమెంట్, బ్యాటరీ పరిశ్రమల రంగం కూడా మంచి పురోగతి సాధించడం వల్లనే అతి పెద్ద మొత్తాలలో జీఎస్టీ వసూలు అయినట్లుగా వాణిజ్య వర్గాలకు చెందిన గణాంకాలు తెలియచేస్తున్నాయి.
ఇవన్నీ ఇలా ఉంతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద పీట వేయడం జరిగింది. దాంతో రాష్ట్రంలో టైర్స్, స్టీల్, ఇతర చిన్న మధ్యతరహా పరిశ్రమలు వరసబెట్టి ప్రారంభం అవుతున్నాయి అని అంటున్నారు.
అంతే కాదు రాష్ట్రంలో శ్రీ సిటీలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు విడి భాగాల తయారీ ఊపందుకుందని నివేదికలు తెలియచేస్తునాయి. అంతే కాదు ఏపీలో అతి పెద్ద నగరం అయిన విశాఖలోని ఫార్మా సిటీలో సైతం పలు పరిశ్రమలు ఉత్పత్తికి శ్రీకారం చుట్టడం వైసీపీ ప్రభుత్వ సారధ్యంలోనే జరిగింది.
దీంతో చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద పారిశ్రామిక రంగంలో 50. 48 శాతం వృద్ధి నమోదైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో వ్యవసాయరంగంలో 63. 19 శాతం వృద్ధి నమోదైంది. ఇది నిజంగా మంచి పరిణామంగా భావిస్తున్నారు.
వాస్తవానికి చూస్తే రెండేళ్ల పాటు కరోనా కారణంగా అనేక కీలక రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దాంతో ఏపీలో సైతం ఇబ్బందులు తలెత్తుతాయని అనుకుననయి. కానీ ఆంధ్రాలో ఉత్పత్తి, పారిశ్రామిక రంగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కృషికి అచ్చమైన నిదర్శనంగానే భావించాల్సి ఉంటుంది.
ఇక ఏపీ ప్రజల తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది. టీడీపీ పాలనలో రూ. 1, 60, 341 ఉండగా ప్రస్తుతం 2023 ఆర్థిక సంవత్సరంలో అది కాస్తా రూ. 2,19, 518కు చేరిందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. దీంతో ఏపీ ప్రజల తలసరి ఆదాయంలో కూడా భారీ వృద్ధి నమోదైంది అని స్పష్టంగా తెలుస్తోంది.
ఇలా కనుక చూస్తే ఏపీలోని అన్ని రంగాలూ ప్రగతిపథంలో పయనిస్తున్నాయని చెప్పక తప్పదు. దాంతో గతానికి భిన్నంగా ఏపీ పురోగతి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు సైతం అందని స్థాయిలో పరుగులు తీస్తోందని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం సమర్ధ పాలనకు ఇది నిదర్శనం అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతకు ముందుచూపునకు కూడా తార్కాణం అని అంటున్నారు. ప్రభుత్వ పరంగా సక్రమమైన ప్రణాళికలను రచించడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో విజయవంతంగా అమలుచేయడం ద్వారానే వైసీపీ ప్రభుత్వం ఈ సక్సెస్ ని సాధించింది అని చెప్పాల్సి ఉంటుంది.
ఏపీలఒ ఏ రంగాలలో అభివృద్ధికి ఆస్కారం ఉందని తెలుసుకుని వాటికి అనుగుణంగా ప్రోత్సహించండం వంటి చర్యల వల్లనే ఈ ప్రగతి సాధ్యమంది అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వ హయాంలో సమీకృత అభివృద్ధి సాధ్యపడింది, అలాగే సమగ్రమైన అభివృద్ధికి కూడా వీలు ఏర్పడింది అని అంటున్నారు. ఏపీని ప్రగతి బాటలో నడిపించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన సమర్ధతను పూర్తి స్థాయిలో చాటుకున్నారు అన్నది మాత్రం అందరి మాటగా ఉంది.