Begin typing your search above and press return to search.

బన్నీ బందన.. గబ్బర్ సింగ్ గమ్మున.. ఎందుకన్నా..?

ఇందులో భాగంగా... "బన్నీ" ని బందిస్తే!! "గబ్బర్ సింగ్" గమ్మునున్నాడెందుకు?? అని పోస్ట్ చేస్తూ ఈ ట్వీట్ కు అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ లను ట్యాగ్ చేశారు అంబటి రాంబాబు.

By:  Tupaki Desk   |   15 Dec 2024 6:10 AM GMT
బన్నీ బందన.. గబ్బర్  సింగ్  గమ్మున..  ఎందుకన్నా..?
X

అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చ నడిచిన, నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... పుష్ప-2 సినిమా విడుదలకు ముందు నుంచీ అంబటి రాంబాబు.. అల్లు అర్జున్ కు మద్దతుగా కీలక పోస్టులు పెడుతూ, సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తాజా అరెస్టునూ ఖండించారు.

సినిమా విడుదల సమయంలో... "పుష్ప-2 తెలుగు వారికి పేరు తేవాలి” అని ఆకాంక్షించిన అంబటి రాంబాబు... సినిమా విడుదల అనంతరం... "పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా.. కాదు.. వరల్డ్ ఫైర్" అంటూ సినిమా సక్సెస్ పైనా.. అరెస్ట్ అనంతరం "అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం!" అంటూ అరెస్టు పైనా స్పందించారు అంబటి.

ఇదే సమయంలో... అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం బిగ్ ట్విస్ట్ గా చెబుతున్న నేపథ్యంలో... "పద్మవ్యూహం నుంచి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు" అంటూ పోస్ట్ పెట్టారు. అనంతరం.. "గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు.. ఇది జనం మాట!" అంటూ పోస్ట్ పెట్టారు.

ఈ పోస్టుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ లను ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ గా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆన్ లైన్ వేదికగా మరో సందేహం తెరపైకి తెచ్చారు అంబటి రాంబాబు. ఇప్పుడు ఈ ట్వీట్ కి సంబంధించిన కామెంట్ సెక్షన్ లో వార్ మొదలైందని అంటున్నారు.

ఇందులో భాగంగా... "బన్నీ" ని బందిస్తే!! "గబ్బర్ సింగ్" గమ్మునున్నాడెందుకు?? అని పోస్ట్ చేస్తూ ఈ ట్వీట్ కు అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ లను ట్యాగ్ చేశారు అంబటి రాంబాబు.

కాగా.. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం ఎక్స్ వేదికగా స్పందించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా.. అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. దీంతో... ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు.. అల్లు అర్జున్ ను నేరుగా ఫోన్ లో పరామర్శించారు. దీంతో.. పవన్ రియాక్షన్ పై ఆన్ లైన్ వేదికగా చర్చ జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. అంబటి ఈ సందేహం లేవనెత్తడం ఆసక్తిగా మారిందని అంటున్నారు!